చార్మింగ్ స్టార్ శర్వానంద్ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ అప్ లో ఉంచారు. ఇటీవల ‘మనమే’తో అలరించిన శర్వా ఇప్పుడు తన నెక్స్ట్ 37వ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నారు. సెన్సేషనల్ హిట్ సామజవరగమన ని అందించిన రామ్ అబ్బరాజు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ ఎంటర్టైనింగ్ మూవీని నిర్మిస్తున్నారు.
మేకర్స్ ఈ రోజు వెరీ ట్యాలెంటెడ్ హీరోయిన్ సాక్షి వైద్యను బోర్డులోకి స్వాగతించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెను నిత్యగా పరిచయం చేశారు. ఈ చిత్రంలో ఆమె ఆర్కిటెక్ట్‌గా కనిపిస్తుంది. శర్వాతో జతకడుతోంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.
టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. భాను బోగవరపు కథ అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్ రాస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాత కాగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
నటీనటుల మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో ఎనౌన్స్ చేస్తారు.
తారాగణం: శర్వానంద్, సాక్షి వైద్య
సాంకేతిక విభాగం:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
కథ: భాను బోగవరపు
డైలాగ్స్: నందు సవిరిగాన
సహ నిర్మాత: అజయ్ సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: విశ్వ సీఎం
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…