చిరంజీవికి అభిమానులుంటారు బాలయ్య బాబు కి అభిమానులుంటారు, అమితాబ్ కు ఉంటారు, రజనికి ఉంటారు, సచిన్ కు ఉంటారు, ధోని కి ఉంటారు. కానీ అంబానీకి ఎవరైనా అభిమానులుంటారా? ఒకడున్నాడు, వాడి పేరు శివ…. 21 ఏళ్ల పిలగాడు. అంబానీకి అర వీర అభిమాని. ఉద్యోగం వ్యవసాయం కాదు, వ్యాపారం చేసి వేలు , కాదు కోట్లు, కాదు కాదు వేల కోట్లు సంపాదించాలని వీడి ఆశ. అదృష్టానికో, దురదృష్టానికో ఉన్న ఉళ్లోనే వీడికి కోట్లు సంపాదించే అవకాశం వస్తుంది. కానీ చీమకు ఏనుగు ఆహారంగా దొరికిన పరిస్థితి. ఎత్తుకెళ్లి పుట్టలో పెట్టుకోలేదు, తిని అరిగించుకోలేదు. ఈ లోపు వేట కుక్కలు, గుంట నక్కలు, హైనాలు, రాబందుల్లాంటి మనుషులను, వైకుంఠపాళి వ్యవస్థలోని అధికార పాములను తప్పించుకుంటూ తట్టుకొని ఈ శివ అనే చిరు చీమ ఏ నిచ్చెనలెక్కి, ఏ చుక్కలనందుకున్నాడో చెప్పే హాస్య భరిత వ్యంగ చిత్రం ‘పైలం పిలగా!’
విలువ లేని వ్యవసాయం చేయలేక, వలస పోయి కార్పొరేట్ బానిస అవలేక ఉన్న ఊళ్ళో నే ఎంట్రప్రెన్యూర్ గా మారి పది మందికి పని కల్పించి, అంబానీల లక్షలు, కోట్లు సంపాదించాలని అత్యుత్సాహం తో కలలు కన్నా ఓ మధ్యతరగతి యువకుడు, పద్మవ్యూహపు మన బ్యూరోక్రసీ వ్యవస్థ లో సమస్త అవస్థలు పడుతూ ఏ ప్రస్థం చేరుకున్నాడో చెప్పే హాస్యభరిత వ్యంగ చిత్రం ‘పైలం పిలగా!’
హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ నిర్మాణంలో రామకృష్ణ బొద్దుల, S.K . శ్రీనివాస్ నిర్మాతలు గా ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన చిత్రం ‘పైలం పిలగా!’ ఈ చిత్ర పోస్టర్/ఫస్ట్ లుక్ ను ఇటీవల విజయవాడలోని KL యూనివర్సిటీ లో జరిగిన రామ్ మిర్యాల మ్యూజిక్ కన్సర్ట్ లో విద్యార్థులు చేత ఆవిష్కరింప చేసారు. ఇన్నోవేటివ్ గా, ఫన్నీ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ విద్యార్థుల్లో అమితాకసక్తిని రేపింది.
పిల్ల పిలగాడు వెబ్ సిరీస్ ఫేమ్ సాయి తేజ హీరో గా, పుష్ప ఫేమ్ పావని కారణం హీరోయిన్ గా , నటించిన ఈ చిత్రంలో దుబ్బింగ్ జానకి, చిత్రం శ్రీను, మిర్చి కిరణ్ తదితరులు నటించారు. చౌరస్తా యశ్వంత్ నాగ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం లో ఆరు పాటలను రామ్ మిర్యాల, చిత్ర, శ్రావణి భార్గవి ఆలపించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ కూర్మన, స్టైలిష్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జుక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ వాడ్నలా పని చేసిన ఈ పైలం పిలగా చిత్రానికి సహా నిర్మాతలు గా కృష్ణమసునూరి, రవి వాషింగ్టన్, విజయ్ గోపు వ్యవహరించారు.
దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9, 2026న విడుదల కాబోతోందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ…
Megastar Chiranjeevi has yesterday ( 19 March 2025 ) added another jewel to his crown……
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’. వైష్ణవి…
టాలీవుడ్లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే…
ఖురేషి అబ్రామ్ యొక్క చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టండి: మార్చి 20న మలయాళ సూపర్స్టార్, కంప్లీట్యాక్టర్ మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్…
American actor Kyle Paul took to his social media to share his thoughts about starring…