జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న చిత్రం
“Bharateeyudu 2” – Chengaluva Lyric Video https://youtu.be/vfHwVlMzUkI
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు.
1996లో కమల్ మాసన్, శంకర్ కాంబినేషన్ విడుదలై బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ భారతీయుడు 2’ రూపొందుతోంది. అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తోన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఇండియన్ 2 ఇంట్రో వీడియోతో పాటు రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘శౌర..’ అనే పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో బుధవారం మేకర్స్ ‘చెంగల్వ చేయందేనా..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.
అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యంలో రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను అబ్బి, శ్రుతికా సముద్రాల పాడారు.
కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీకర ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ గా వర్క్ చేస్తున్నారు. బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణకుమార్‌లతో కలిసి డైరెక్టర్ శంకర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.
‘భారతీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.
నటీనటులు:
కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్, పియుష్ మిశ్రా, గురు సోమసుందరం, డిల్లీ గణేష్, జయప్రకాష్, మనోబాల, అశ్వినీ తంగరాజ్ తదితరులు
సాంకేతిక వర్గం:
కథ, దర్శకత్వం: ఎస్.శంకర్, స్క్రీన్ ప్లే: ఎస్.శంకర్, బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణ కుమార్, మ్యూజిక్ : అనిరుద్ రవిచంద్రన్, ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: రవివర్మన్, ఆర్ట్: ముత్తురాజ్, స్టంట్స్: అనల్ అరసు, అన్బరివు, రంజాన్ బులట్, పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ, డైలాగ్ రైటర్: హనుమాన్ చౌదరి, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: వి.శ్రీనివాస్ మోహన్, కొరియోగ్రఫీ: బాస్కో సీజర్, బాబా భాస్కర్, పాటలు: శ్రీమణి, సౌండ్ డిజైనర్: కునాల్ రాజన్, మేకప్ : లెగసీ ఎఫెక్ట్-వాన్స్ హర్ట్‌వెల్- పట్టణం రషీద్, కాస్టూమ్ డిజైన్: రాకీ-గవిన్ మ్యూగైల్- అమృతా రామ్-ఎస్‌బి సతీషన్-పల్లవి సింగ్-వి.సాయి, పబ్లిసిటీ డిజైనర్: కబిలన్ చెల్లయ్య ,పి.ఆర్.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుందర్ రాజ్, హెడ్ ఆఫ్ లైకా ప్రొడక్షన్స్: జి.కె.ఎం.తమిళ్ కుమరన్, రెడ్ జైంట్ మూవీస్: సెన్‌బగ మూర్తి, నిర్మాత: సుభాస్కరన్.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…