భయపెడుతున్న ఎర్ర చీర మోషన్ పోస్టర్

పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా బేబీ డమరి సమర్పణలో నిర్మించిన హర్రర్, యాక్షన్, థ్రిల్లర్, మదర్ సెంటిమెంట్ సౌత్ ఇండియా చిత్రం ఎర్రచీర.


నవంబర్ 9న అందరినీ భయపెట్టే ఎర్రచీర సినిమా విడుదల కానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ రాఖీ పండుగ సందర్భంగా మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ కనుక గమనిస్తే సినిమాలో భారీ తారాగణంతో సమానంగా ఎర్రచీర ఎలాంటి ముఖ్యపాత్ర పోషించినదో ప్రేక్షకులకు తెలియచేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బేబీ సాయి తేజస్విని నటన సరికొత్తగా ఉంటుందని ఈ చిత్రం చూస్తున్నంతసేపు హర్రర్ సీన్స్ తో థ్రిల్లింగ్గా ఉంటుందని, మదర్ సెంటిమెంట్ హార్ట్ టచింగ్ గా ఉంటుందని” దర్శకుడు సుమన్ బాబు తెలిపారు.

ఈ ఎర్ర చీర వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవాలి అంటే నవంబర్ 9న సినిమాని థియేటర్స్ లో చూడాల్సిందే అని ఆయన అన్నారు. ఈ సినిమాలో Eight Layers వారి VFX తో కళ్లుచెదిరే 36 నిమిషాల గ్రాఫిక్స్ తో, మంచి నిర్మాణ విలువలతో నిర్మించబడినదని నిర్మాతలు NVV సుబ్బారెడ్డి, సుమన్ బాబు తెలిపారు.

ఎర్ర చీర సినిమాలో ప్రధాన పాత్రగా శ్రీరామ్, kgf ఫేమ్ అయ్యప్ప పీ శర్మ, సీనియర్ నటులు DR. రాజేంద్ర ప్రసాద్ గారి ముద్దుల మనవరాలు అయిన మహానటి ఫేమ్ సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, కమల్ కామరాజు, సుమన్ బాబు, అజయ్, అలీ, రఘుబాబు, గీతాసింగ్, జీవ, భద్రం, సురేష్ కొండేటి, అన్నపూర్ణమ్మ, సత్య కృష్ణ తదితరులు నటించారు.

ఈ సినిమాకు
VFX – విక్రాంత్ & భరత్
రీ రికార్డింగ్- చిన్న
సంగీతం – ప్రమోద్ పులిగిల్ల
సౌండ్ ఎఫెక్ట్స్ – ప్రదీప్
DOP – చందు
ఎడిటర్- వెంకట ప్రభు
ఆర్ట్- సుభాష్, నాని
స్టంట్స్ – నందు
లైన్ ప్రొడ్యూసర్స్ – అబ్దుల్ రెహమాన్, కరణ్
చీఫ్ కో డైరెక్టర్స్- నవీన్, రాజమోహన్
నిర్మాతలు- NVV. సుబ్బారెడ్డి, సుమన్ బాబు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :- సుమన్ బాబు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago