మే 3న వస్తోన్న సత్యదేవ్ ‘కృష్ణమ్మ‘

పక్కా కమర్షియల్‌ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్‌ మూవీ అయినా నటనకు ప్రాధాన్యముందంటే, ఆటోమేటిగ్గా అందరి చూపులూ హీరో సత్యదేవ్‌ వైపు తిరగాల్సిందే. సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్‌ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్‌. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా కృష్ణమ్మ. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా కృష్ణమ్మ మూవీ తెరకెక్కుతోంది. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. కొరటాల శివ సమర్పిస్తున్న సినిమా ఇది. కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 3 గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా…

నిర్మాత కృష్ణ కొమ్మలపాటి మాట్లాడుతూ ”రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన సినిమా ఇది. టైటిల్‌ కృష్ణమ్మ అని ఎందుకు పెట్టామో, సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన సత్యదేవ్‌ కచ్చితంగా ఈ సినిమాతో మరో రేంజ్‌కి చేరుకుంటారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి, పాటలకి చాలా మంచి స్పందన వస్తోంది. కాలభైరవ తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌  చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వేసవి కానుకగా మే 3న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.
 దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ మాట్లాడుతూ ”స్నేహానికి ఉన్న విలువను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. టైటిల్‌ సాంగ్‌లోనే హీరోకి, అతని స్నేహితుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాం. ఇంటెన్స్ థ్రిల్లర్‌ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సమ్మర్‌కి ఓ బెస్ట్ సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు తప్పక కలుగుతుంది” అని చెప్పారు.

ఈ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు.   లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు.

నటీనటులు:

సత్యదేవ్, అతీరా రాజ్, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు

సాంకేతిక వర్గం:

సమర్పణ –  కొరటాల శివ, బ్యానర్ – అరుణాచల క్రియేషన్స్, నిర్మాత – కృష్ణ కొమ్మలపాటి, రచన, దర్శకత్వం – వి.వి.గోపాలకృష్ణ, సంగీతం – కాల భైరవ, సినిమాటోగ్రఫీ – సన్నీ కూరపాటి, ఎడిటర్ – తమ్మిరాజు, ఆర్ట్ – రామ్ కుమార్, పాటలు – అనంత శ్రీరాం, ఫైట్స్ – పృథ్వీ శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రవి సూర్నెడ్డి, పి.ఆర్.ఒ – వంశీ కాకా.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 hour ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago