వైవిధ్యమైన పాత్రలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
రీసెంట్‌గానే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం టీం చకచకా షూటింగ్‌ను ఫినిష్ చేస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశారు. హైదరాబాద్‌లోనే జరిగిన ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక నిర్విరామంగా షూటింగ్ చేసి సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు.
నటీనటులు : లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
బ్యానర్స్: దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్
నిర్మాతలు: నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి
దర్శకత్వం: తాతినేని సత్య
సంగీతం: మిక్కీ జె.మేయర్
సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్
మాటలు: ఉదయ్ పొట్టిపాడు
ఆర్ట్: కోసనం విఠల్
ఎడిటర్: సతీష్ సూర్య
పి.ఆర్.ఒ: మోహన్ తుమ్మల
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…