‘సతీ లీలావతి’ పూర్తిగా వినోదాత్మక చిత్రం.. మార్చి 6న మా సినిమాని చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను.. ప్రెస్ మీట్‌లో లావణ్య త్రిపాఠి కొణిదెల

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్ నిర్మించిన చిత్రం ‘సతీ లీలావతి’. ఈ సినిమాకి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. మార్చి 6న ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నట్టుగా బుధవారం నాడు ప్రకటించారు. ఈ క్రమంలో ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో..

లావణ్య త్రిపాఠి కొణిదెల మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ని ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. దర్శక, నిర్మాతల సపోర్ట్ వల్లే నేను షూట్ చేయగలిగాను. సప్తగిరి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అందరూ గొప్ప ఆర్టిస్టులు నటించారు. దేవ్ మోహన్ గారి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాని మార్చి 6న చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ .. ‘కమల్ హాసన్ గారు చేసిన ‘సతీ లీలావతి’తో మాత్రం నా సినిమాని పోల్చను. అందరూ రిలీట్ అయ్యేలా.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తీశాం. మార్చి 6న మా మూవీని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

నిర్మాత నాగ మోహన్ మాట్లాడుతూ .. ‘నిర్మాతగా నాకు ‘సతీ లీలావతి’ మొదటి చిత్రం. ఈ సినిమా ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నాను. మార్చి 6న మా మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. మా చిత్రానికి మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నటుడు సప్తగిరి మాట్లాడుతూ .. ‘పాత ‘సతీ లీలావతి’ ఎంత పెద్ద హిట్ అయిందో మా ఈ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతకు ఇదే మొదటి చిత్రం. సత్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. మార్చి 6న ఈ మూవీని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

తారాగణం: లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్, నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి తదితరులు

సిబ్బంది:
సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
బ్యానర్: దుర్గాదేవి పిక్చర్స్
నిర్మాత: నాగ మోహన్
దర్శకుడు: తాతినేని సత్య
సంగీతం: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్
డైలాగ్స్ : ఉదయ్ పొట్టిపాడు
ఆర్ట్ : కొసనం విఠల్
ఎడిటర్ : సతీష్ సూర్య
పీఆర్వో : మోహన్ తుమ్మల

TFJA

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

9 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago