‘యావరేజ్ స్టూడెంట్ నాని’ నుంచి ‘సారా సారా’ పాట విడుదల

టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. ఆడియెన్స్ టేస్ట్‌కు తగ్గట్టుగా సినిమాలు వస్తున్నాయి. పెద్ద హీరోల చిత్రాలను సైతం ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే టాలీవుడ్ మేకర్లు కొత్త కథలు, కాన్సెప్టుల మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకులు హీరోలుగా.. హీరోలు దర్శకరచయితలుగా మారుతున్నారు. మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్.. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కూల్ అప్డేట్‌ను ఇచ్చారు. బయట ఉన్న కూల్ వెదర్‌కు తగ్గట్టుగా, మనసుకు హత్తుకునేలా, హాయినిచ్చేలా సాగే ఓ మెలోడీ పాటను వదిలారు. సారా సారా అంటూ సాగే ఈ పాటను శివకృష్ణచారి ఎర్రోజు రచించగా.. పద్మలత, అనుదీప్ దేవ్ ఆలపించారు. కార్తిక్ బి కొడకండ్ల ఇచ్చిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందించారు. ఉద్ధవ్ ఎస్ బి ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేశారు.

తారాగణం: పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: పవన్ కుమార్ కొత్తూరి
నిర్మాతలు: పవన్ కుమార్ కొత్తూరి, బిషాలి గోయెల్
సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల
DOP: సజీష్ రాజేంద్రన్
ఎడిటర్: ఉద్ధవ్ SB
సాంగ్స్ కొరియోగ్రఫీ : రాజ్ పైడి మాస్టర్
ఫైట్స్: నందు
PRO: ఎస్ ఆర్ ప్రమోషన్స్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

22 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

22 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

22 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago