సెప్టెంబ‌ర్ 22న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ రుద్రంకోట‌

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హిరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం రుద్రంకోట‌. ఏఆర్ కె విజువ‌ల్స్ ప‌తాకంపై రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్‌, విభీష, రియా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 22న స్క్రీన్ మాక్స్ పిక్చ‌ర్స్ సంస్థ ద్వారా వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా హీరో, నిర్మాత అనిల్ ఆర్క కండ‌వ‌ల్లి మాట్లాడుతూ…శ్మ‌శాన వాటిక‌లో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమ‌కథా చిత్ర‌మిది. భ‌ద్రాచలం ద‌గ్గ‌ర రుద్రంకోట అనే ఊరి నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూపించ‌ని అంశాల‌ను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అంశాలుంటాయి. సీనియ‌ర్ న‌టి జ‌య‌లలిత గారు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హరిస్తూ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు కోటి గారు మా చిత్రానికి అద్భుత‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సుభాష్ ఆనంద్ అందించిన రెండు పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లై ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ ప్ర‌ముఖులు యుబైఏ స‌ర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్ర‌శంసించారు. మా సినిమా న‌చ్చ‌డంతో స్క్రీన్ మాక్స్ పిక్చ‌ర్స్ వారు విడుద‌ల చేయ‌డానికి ముందుకొచ్చారు. సెప్టెంబ‌ర్ 22న వ‌ర‌ల్డ్ వైడ్ గా సినిమాను గ్రాండ్ గా విడుద‌ల చేయ‌నున్నాం అన్నారు.

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత‌, ఆలేఖ్య‌, బాచి, ర‌మ్య త‌దితరులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి డిఓపీః ఆదిమ‌ల్ల‌ సంజీవ్‌; సంగీతంః సుభాష్ ఆనంద్‌, నిరంజ‌న్‌; ఎడిట‌ర్ః ఆవుల వెంకటేష్‌; కొరియెగ్ర‌ఫీః కీర్తి శేషులు శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ , సుచిత్ర చంద్ర‌బోస్; ఫైట్స్ః జాషువా; డైలాగ్స్ః రంగ‌; లిరిక్స్ః సాగ‌ర్‌; డిజైన‌ర్ః వివా రెడ్డి; పీఆర్ ఓః చంద్ర వ‌ట్టికూటి, మోహ‌న్ తుమ్మ‌ల‌, జీకే మీడియా; నిర్మాతః అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి; స్టోరి-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః రాము కోన‌.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago