రివైండ్ మూవీ ఈనెల 18న సౌత్ ఇండియా లో బ్రహ్మాండమైన విడుదల

సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా వస్తున్న సినిమా రివైండ్. ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు. జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 18న ఈ సినిమాని సౌత్ ఇండియా మొత్తం లో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మరియు దర్శకుడు కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ : సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియాకి కృతజ్ఞతలు. మేము రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ కి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాలోని పాటలు సాఫ్ట్వేర్ వద్దురా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ముఖ్యంగా లవ్ యు నాన్న సాంగ్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. అన్ని పాటలు మిలియన్ వ్యూస్ తో సినిమా పైన అంచనాలు పెంచాయి. కొత్త కాన్సెప్ట్ తో టైం ట్రావెల్ మీద ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా మీద నమ్మకంతో మీడియా షోలు వేయడం జరిగింది. చూసిన డిస్ట్రిబ్యూటర్స్ సినిమా నచ్చి విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. సపోర్ట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని, కొత్త కంటెంట్ ని ఎపుడు ప్రోత్సహిస్తారు. మా సినిమా ని కూడా అదే విధంగా ప్రోత్సహించి ఆదరిస్తారని, సినిమాకి పెద్ద విజయం చేకూరుస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :
సాయి రోనక్, అమృత చౌదరి, సురేష్ గారు, జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ తదితరులు

టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రాస్ వైర్ క్రియేషన్స్
మ్యూజిక్ : ఆశీర్వాద్
లిరిసిస్ట్ : రవివర్మ ఆకుల
సినిమాటోగ్రఫీ : శివ రామ్ చరణ్
ఎడిటర్ : తుషార పాలా
స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం : కళ్యాణ్ చక్రవర్తి
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పి ఆర్ ఓ : మధు VR

Tfja Team

Recent Posts

‘శబార’ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది.. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ఈవెంట్‌లో హీరో దీక్షిత్ శెట్టి

దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…

1 hour ago

‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…

2 hours ago

షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం…

తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో…

20 hours ago

యూవీ కాన్సెప్ట్స్, సంతోష్ శోభన్ “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నుంచి ‘గాబరా గాబరా..’ లిరికల్ సాంగ్ రిలీజ్

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…

20 hours ago

ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ‘హే భగవాన్‌’

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

20 hours ago

త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో…

4 days ago