బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రజాకార్. ఈ చిత్రాన్ని సమర్‌వీర్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. యాట సత్యనారాయణ దరకత్వం వహించారు. 1940 దశకంలో రజాకార్లు సాగించిన అకృత్యాలకు తెరరూపమిచ్చిందీ మూవీ. గతేడాది మార్చి 15న థియేటర్స్ లో రిలీజై మంచి విజయాన్ని అందుకున్న రజాకార్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రతి రివ్యూలోనూ సినిమా మేకింగ్ , సీన్స్ బాగున్నాయంటూ విశ్లేషకులు అప్రిషియేట్ చేశారు.
థియేట్రికల్ రిలీజ్ అయిన పది నెలల తర్వాత రజాకార్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. గత నెల 24వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న రజాకార్ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. స్టార్ హీరోలతో పోటీ పడుతూ ఈ సినిమా నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 50 మిలియన్ మినిట్స్ ఫ్లస్ వ్యూయర్ షిప్ అందుకుని దూసుకెళుతోంది. రజాకార్ వ్యవస్థను నేపథ్యంగా ఎంచుకుని కథే హీరోగా దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమాను రూపొందించారు. ఆద్యంతం ఆకట్టుకునేలా రజాకార్ సినిమాను దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన తీరు సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల దాకా అందరి ప్రశంసలు అందుకుంటోంది. సాంకేతిక నిపుణుల ప్రతిభతో పాటు బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ నటన ఈ సినిమాకు ఆకర్షణగా నిలుస్తోంది
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…