రామ జన్మభూమి టీసర్ లాంచ్

సముద్ర మూవీస్ బ్యానర్ నుండి ‘రామ జన్మభూమి’ టీసర్ రిలీజ్ అయ్యింది, యువత రాజకీయాలలోకి రావాలి అనే కాన్సెప్ట్ లో వచ్చిన ఈ టీసర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి. సముద్ర ఈ ‘రామ జన్మభూమి’ కి దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించారు. రవి శంకర్ కథకి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ ని అందించారు.

సీనియర్ హీరో మురళి మోహన్ మాట్లాడుతూ: ఈరోజు దేశం మొత్తం ఎక్కడ విన్నా జై శ్రీ రామ్ నినాదమే. రామ జన్మ భూమి నిర్మాణం అయ్యాక రోజు లక్షల్లో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు, అలాంటి ‘రామ జన్మ భూమి’ టైటిల్ తో దర్శకుడు సముద్ర గారు జై సిద్దార్ద్ హీరోగా సినిమా చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. సముద్రగారు ఎన్నో హిట్టు సినిమాలు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళి ఫార్మ్ లోకి వచ్చారు, కచ్చితంగా ఈ ‘రామ జన్మభూమి’ కూడా పెద్ద హిట్ అవుతుంది.

బి జే పి ఎంపీ అభ్యర్థి మాధవి లత మాట్లాడుతూ: ఈరోజు కర్నల్ బిక్షపతి గారు ఫోన్ చేసారు, ఒకప్పుడు కాశ్మీర్లో మిలిటరీ వారి ముఖాల మీద, మోకాళ్ళ మీద రాళ్ళూ వేసే వారు, అందుకని పేస్ షీల్డ్స్ అండ్ క్నీ పాడ్స్ ఇచ్చాము, మోది గారు ఆర్టికల్ 370 ఎత్తేయ్యగానే ఆ రాళ్ళూ విసిరే వాళ్ళే లేరు అని చెప్పారు. ఈ మార్పు అంతా కూడా మోది గారు వల్లనే వచ్చింది. ఎంత మంది దేవుళ్ళు ఉన్నా కూడా మనం రాముడినే ఎక్కువగా కొలవడానికి కారణం రాముడు ఈ భూమి మీద ధర్మ బద్ధంగా ఉంటూ అనేక కష్టాలు అనుభవించారు. ‘రామ జన్మభూమి’ టీసర్ కొస్తే హీరో తన దేశ భక్తి చాటుకునేలా ఉంది, సినిమా మంచి హిట్టు అవ్వాలని కోరుకుంటూన్నాను

డైరెక్టర్ సముద్ర రావు మాట్లాడుతూ: ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది, దేవుడే రాముడిగా వచ్చినా మానవుడిగా ధర్మ బద్దంగా బ్రతికారు, ఒక దేశానికి రాజుగా, ఒక తండ్రికి మంచి బిడ్డగా, తమ్ముళ్ళకి అన్నగా ఇలా ధర్మ బద్ధంగా బ్రతికి మనకి చూపించారు. ప్రతి పౌరుడు రాముడిలా బ్రతకాలి, ధర్మంగా మెలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, రాజకీయాలలోకి యువత కచ్చితంగా రావాలి అనే సందేశంతో ఈ సినిమా చేస్తున్నాను.

హీరో జై సిద్ధార్థ్ మాట్లాడుతూ: ఇండస్ట్రీకీ సింహరాశి, శివ రామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సేవకుడు, పంచాక్షరీ, మహానంది లాంటి గొప్ప సినిమాలని అందించిన వి. సముద్ర గారి దర్శకత్వంలో నా రాముడి పేరుతో వచ్చిన ‘రామ జన్మ భూమి’ సినీమాతో నేను హీరో గా లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. రాముడు ఎప్పుడో మనకి నేర్పిన వాటిని మనం ఎప్పుడూ తప్పకుండా పాటించాలి, అలా పాటించడం మర్చిపోయినప్పుడు, హనుమంతుడు వచ్చి సరి చేసి వెళ్తారు, అందుకే ఇప్పుడు నరేంద్రమోది గారు హనుమంతుని రూపంలో వచ్చి మన దేశాన్ని గాడిలో పెడుతున్నారు. అలాగే లోకల్ లో చాలా మంది చిన్న చిన్న రాక్షసులు ఉంటారు వాళ్ళని లైన్ లో పెట్టడానికి యువత రాజకీయాలలోకి రావాలి అనేది మా కథ.

మా ‘రామ జన్మ భూమి’ అప్డేట్స్, రిలీజ్ డేట్ ముందు ముందు మరెన్నో ఇచ్చి ప్రేక్షకులని ఇదే రీతిలో అలరిస్తామని చిత్ర యూనిట్ తెలిపారు

నటీనటులు: జై సిద్ధార్ద్, శ్రీ రాధా ,నాసర్, సుమన్, అజయ్ గోష్
సునీల్, అనుపమ్ ఖేర్, కన్నడ కిషోర్, బాహుబలి ప్రభాకర్, దేవ్ గిల్
బీసంట్ రవి, తమిళ్ శ్రీ రామ్
దేవరాజ్ తదితరులు

టెక్నికల్ విభాగం:
నిర్మాత: వి. సముద్ర రావ్
దర్శకుడు: వి. సముద్ర రావ్
సహా నిర్మాతలు: ఖాజా. దుర్గయ్య, కోటేశ్వర రావు. శ్రీ హరి
మ్యూజిక్: రవి శంకర్
లిరిక్స్: వెనిగల్ల రాము, అభినయ శ్రీను
పిఆర్ఓ: మధు విఆర్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago