టాలీవుడ్

తొలి సారిగా ‘యానిమల్ ఆరాధ్య’ ఫోటో సిరీస్ ను ఆవిష్కరించిన రాంగోపాల్ వర్మ

నా చిత్రాలలో హీరోయిన్స్ గా నటించిన వారందిరిలో మొదటి స్తానం ఆరాధ్య దేవి కే ఇస్తాను ఇది సీక్రెట్ : రాంగోపాల్ వర్మ

ప్రముఖ స్టిల్స్ ఫోటోగ్రాపర్ నవీన్ కళ్యాణ్ భారతీయ సినీ చరిత్ర లో తొలి సారిగా ఓ విప్లవాత్మక ఫోటో సిరీస్ కి శ్రీకారం చుట్టారు. ఆరాధ్య దేవి ప్రదాన పాత్రతో రామ్ గోపాల్ వర్మ నేతృత్వంలో తెరకెక్కిన ‘శారీ’ చిత్రం త్వరలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే! ఆ చిత్ర హీరోయిన్ ఆరాధ్య దేవి తో నవీన్ కళ్యాణ్ ‘యానిమల్ ఆరాధ్య’ టైటిల్ తో ఫోటో సిరీస్ రూపొందించి సరికొత్త ప్రయోగం చేసాడు. హైదరాబాద్ లోని ఓ పబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామ్ గోపాల్ వర్మ హాజరై ఫోటో సిరీస్ ని ఆవిష్కరించారు.
ఈ ఫోటో సిరీస్ లోని అంత్యంత ప్రత్యేకత ఏమిటంటే ఇంతవరకూ భారతీయ సినీ చరిత్ర లో ఇంత వినూత్న తరహా లో ఫోటోలను తీయడం జరగలేదు. అందువల్ల ఇది సమ్ థింగ్ స్పెషల్ ఫోటో సీరిస్ అని ఫోటోగ్రాఫర్ నవీన్ కళ్యాణ్ చెబుతున్నారు. అందమైన ఆరాధ్యదేవిని ఒక వైల్డ్ యానిమల్ కంపేరిజన్ తో సరికొత్త క్రియేటివిటీ తో, ఆమెలోని అందాన్ని అడివి మృగాలతో మిక్స్ చేసిన హై ఫ్యాషన్ ఫోటో సీరిస్ గా రూపొందించారు.
ఈ వైల్డ్ ఫోటో లలో ఆరాధ్య ని అడివి జంతువులైన మాకావు , ఇగువానా , కొండచిలువ, నల్ల హంస, ఆస్ట్రీచ్ మరియు  రేస్ గుర్రoల తో కలిసి కళ్యాణ్  ఈ అధ్బుతమైన చిత్రాలను తన కెమెరాలో భందించారు. ఈ ఫోటో షూట్ కు ప్రణతి వర్మ కాస్టుమ్ డిజైనర్ గా వ్యవహరించారు. చూపు మరల్చనీయకుండా చేసే ఈ ఫోటో సీరిస్ స్వేచ్ఛకు, నిర్భయానికీ ప్రతీకగా ఉన్నాయి.

ఆవిష్కరణ తరువాత దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ -“అడవి మృగలంటేనే అందరు భయపడతారు…ఎందుకంటె అవి మనల్ని ఏం చేస్తాయన్నది మనం ఊహించలేము. అలాంటిది మా హీరోయిన్ ఆరాధ్య ఎంతో ధైర్యంగా వాటిని కలుపుగోలుగా మచ్చిక చేసుకుని ఈ ఫోటో సిరీస్ చేసింది. ఇలా అడివి జంతువులతో ఒక అమ్మాయి ఫోటో షూట్ చేయడం సమ్ థింగ్ స్పెషల్ భారతీయ సినీ చరిత్ర లో ఇంత వినూత్న తరహా లో చిత్రీకరించిన ఫోటోగ్రాఫర్ నవీన్ కళ్యాణ్ ను అభినందిస్తున్నాను. ఇక ఆరాధ్య దేవి గురించి చెప్పాలంటే కేరళకు చెందిన అమ్మాయి – ఇంతకు ముందు శ్రీలక్ష్మి అనే పేరుతో సాగింది.  ఆరాధ్యను ఓ ఇన్ స్టా రీల్ లో తొలుత శారిలో చూసాను. ఆ తరువాత ఈ అమ్మాయి సైకలాజికల్ థ్రిల్లర్ కథ ‘శారీ’ చిత్రం లో కథానాయకి గా సరిపోతుందని సినిమా పూర్తి చేసాం. ఈ నెల 28న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పుడు ఆ శారీ లో వున్నాఅమ్మాయి ఈ విధంగా చుడోచ్చనేది నవీన్ కళ్యాణ్ మదిలో మెదిలిన ఆలోచన. ఈ క్రెడిట్ అంతా అతనిదే!” అన్నారు.

స్టిల్స్ ఫోటోగ్రాపర్ నవీన్ కళ్యాణ్ మాట్లాడుతూ – “నేను అర్జివి సర్ వద్ద పదేళ్లుగా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ నుండి కూడా నన్ను సర్ బాగా సప్పోర్ట్ చేస్తున్నారు. అయితే ఓ రోజు నన్ను ఆఫీస్ కి పిలిపించి శారీ చిత్రంలోని ఓ పాటను చూపించారు. పాటలు చాల బాగున్నాయి. ఆరాధ్య ఆ పాటల్లో చాలా అందంగా హుందాగా కనిపించింది. అయితే ఆరధ్యను ప్రత్యేకంగా ఓ ఫోటో షూట్ చేద్దామని అడిగాను. దానికి ఆర్జీవి సర్ ఎప్పుడూ రెగ్యులర్ గా వుండే ఫోటోలు కాదు ఏదైనా డిఫరెంట్ చెయ్యి అన్నారు. అప్పడు వైల్డ్ యనిమల్స్ తో ఓ ఫోటో షూట్ చేద్దామని అనుకుంటున్నానని చెప్పా! మరి నీ ఓకేనా అంటే అవి వైల్డ్ యనిమల్స్ కదా మైంటైన్ చేయగలవా అన్నారు. సరే అనుకుని వాటితో షూటింగ్ చేసాము. నాకైతే కెమెరా తో పని కాని ఆ పాము, ఇగువాన వంటి ఒళ్ళు జలదరించే వాటితో ఆరాధ్య ఎంతో ఫ్రెండ్లీ గా ఫోటో షూట్ కి సహకరించింది.” అన్నారు.

ఆరాధ్య దేవి మాట్లాడుతూ – “ఈ ఫోటో షూట్ గురించి ఆర్జీవి సర్ చెప్పినపుడు నేను కాస్త ఆలోచించాను! కొత్తదనం కోసం పరితపించే ఆర్జీవి సర్ ఊరికే చెప్పారు. ఏ మాత్రం సంకోచించకుండా ఒప్పుకున్నాను. ఆర్జీవి సర్, నవీన్ కళ్యాణ్ గారి ఎంకరేజ్మెంట్ తో ఈ ఫోటో షూట్ పూర్తి చేశాను. వైల్డ్ యనిమల్స్ అంటే అందరికి భయమే షూట్ జరుగుతున్నపుడు నాకు కూడా అస్త్రిచ్ తో ఓ సారి భయమేసింది.”అన్నారు.

కాస్టుమ్ డిజైనర్ ప్రణతి వర్మ – “నవీన్ కళ్యాణ్, ఆర్జీవి సర్ ఈ కాన్సెప్ట్ చెప్పినపుడు వైల్డ్ యనిమల్స్ తో ఫోటో షూట్ అనగానే ఇదేదో కొత్తగా వుంది అనుకున్నాను ఓ చాలెంజ్ గా తెసుకున్నాను. యం టి వి వంటి పాపులర్ మ్యూజిక్ చానల్ లో ఓ సారి ఓ వీడియో ఆల్బం చూసాను….ఆ రిఫరెన్స్ తీసుకుని ఈ షూట్ కి డిజైన్ చేయడం జరిగింది.”అన్నారు.

ఆ తరువాత రామ్ గోపాల్ వర్మతో ప్రశ్న జవాబుల కార్యక్రమం జరిగింది.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

10 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago