క‌ల్చ‌ర్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అవార్డ్ అందుకోనున్న‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్

రామ్ చ‌ర‌ణ్ న‌టించిన RRR చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త రికార్డుల‌ను సృష్టించ‌ట‌మే కాదు, అందులోని ‘నాటు నాటు..’ పాట‌కు ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఇది ఇండియ‌న్ సినిమాకు ఎంతో గ‌ర్వ కార‌ణంగా నిలిచింది. ఇది రామ్ చ‌ర‌ణ్‌కు విజ‌యాన్ని అందించ‌టంతో పాటు భార‌తీయ సినిమాపై తిరుగులేని ప్ర‌భావాన్ని చూపించింది. అలాగే రామ్ చ‌ర‌ణ్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ద‌క్కింది.

ఇండియ‌న్ సినిమాల్లో లెజెండ్రీ న‌టుడైన చిరంజీవి త‌న‌యుడిగా రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు త‌న‌దైన ముద్ర వేశారు. ఆయ‌న ఇండియ‌న్ సినిమాకు చేసిన కృషి అసాధార‌ణ‌మైన‌ది. అలాంటి న‌టుడు IFFMలో పాల్గొన‌టం అనేది ఆయ‌న‌కు మ‌రింత గుర్తింపును తెచ్చి పెట్ట‌ట‌మే కాదు ఇండియ‌న సినిమాకు చేసిన స‌పోర్ట్‌కు మ‌రో మెట్టుకు ఎక్కించేలా ఉంది.

ఈ  IFFM వేడుక‌ల్లో గౌర‌వ అతిథిగా ఉండ‌టంతో పాటు.. ఇండియ‌న్ సినిమాకు ఆయ‌న చేసిన సేవ‌కుగానూ ఇండియ‌న్ ఆర్ట్ అండ్ కల్చ‌ర్ అంబాసిడర్‌గా అందుకోనున్నారు. ఈ ఫెస్టివ‌ల్‌లో చ‌ర‌ణ్ పాల్గొన‌టం అనేది ఆయ‌న గౌర‌వాన్ని మ‌రింత‌గా పెంపొందిస్తోంది. త‌ద్వారా చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మలో త‌న అద్భుత‌మైన ప్ర‌యాణాన్ని ఇది తెలియ‌చేస్తుంది.

ఈ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ స్పందిస్తూ.. ‘‘ మ‌న భార‌తీయ చిత్రాల్లోని వైవిధ్యాన్ని, గొప్ప‌దనాన్ని ఇలాంటి ఓ అంత‌ర్జాతీయ వేదిక‌గా ఘ‌నంగా నిర్వ‌హిస్తుండ‌టం ఆనందంగా ఉంది. అలాంటి ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో భాగం కావ‌టం అనేది నాకు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నాను. ఈ వేదిక‌పై మ‌న చిత్ర ప‌రిశ్ర‌మ త‌ర‌పున నేను ప్రాతినిద్యం వ‌హించ‌టం ఆనందంగా ఉంది. అలాగే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్ర‌ముఖుల‌తో క‌నెక్ట్ కావ‌టం అనేది మ‌రింత ఉత్సాహాన్ని క‌లిగిస్తోంది. ట్రిపులార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి విజ‌యాన్ని ద‌క్కించుకుందో అంద‌రికీ తెలుసు. ఆ సినిమాను ఆద‌రించిన తీరు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మెల్‌బోర్న్‌లో ఆ సినిమాకు సంబంధించిన క్ష‌ణాల‌ను ప్రేక్ష‌కుల‌తో పంచుకోవ‌టం నాకు మాట‌ల్లో చెప్ప‌లేని సంతోషాన్ని క‌లిగిస్తోంది. మెల్‌బోర్న్‌లో మ‌న జాతీయ జెండాను ఎగుర‌వేసే అద్భుత‌మైన అవ‌కాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

IFFM డైరెక్టర్ మితు బౌమిక్ లాంగ్ మాట్లాడుతూ ‘‘IFFM 15 ఎడిషన్ సినీ వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొనబోతుండటం అందరిలో ఆస‌క్తిని పెంచ‌టంతో పాటు మాకెంతో గౌర‌వంగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టుడిగా ఆయ‌న క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ఇండియ‌న్ సినిమాలో ప్ర‌భావంతమైన న‌టుల్లో ఒక‌రిగా నిల‌బెట్టింది. ఆయ‌న్ని మెల్‌బోర్న్‌కు సాద‌రంగా స్వాగతించ‌టానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. అలాగే ఆయ‌న విజ‌యాల‌ను ఇక్క‌డ మ‌రింత ఘ‌నంగా జ‌రుపుకోబోతున్నాం’’ అన్నారు.

ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్ 15వ ఎడిష‌న్‌లో రామ్ చ‌ర‌ణ్ పాల్గొన‌బోతుండ‌టం అంద‌రిలోనూ ఆస‌క్తిని పెంచుతోంది. అలాగే అంద‌రికీ మ‌ర‌చిపోలేని అనుభూతిని క‌లిగిస్తుంద‌ని క‌మిటీ తెలియ‌జేసింది. ఈ 15వ ఎడిష‌ను  చాలా వైభ‌వంగా ఓ మైలురాయిలా నిల‌చిపోయేటట్లు సెల‌బ్రేట్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సద‌ర‌న్ హెమీస్పియ‌ర్‌లో జ‌రిగే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో  IFFM ఒక‌టి.

రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‌ను రామ్ చ‌ర‌ణ్ పూర్తి చేశారు. శంకర్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ క‌థానాయిక‌. త్వ‌ర‌లోనే RC16ను ప్రారంభించ‌నున్నారు. ఇందులో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌. అలాగే RC17  సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది.

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

10 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago