‘రాజు యాదవ్‌’ చిత్రం అందరినీ అలరిస్తుంది. : పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. మే 24న రాజు యాదవ్ విడుదల కానుంది.  

తాజాగా గెటప్ శ్రీను, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు. ఈ సందర్భంగా ‘రాజు యాదవ్‌’ టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

”గెటప్ శ్రీను.. ఈ పేరు తలచుకోగానే జబర్దస్త్ లో రకరకాల గెటప్పులు, హావభావాలు, గొంతులు, యాస మార్చి నటిస్తూ నవ్వించే నటుడు మన కళ్ళముందు కనబడతాడు. ఈ తరం కామెడీ నటుల్లో నాకు ఇష్టమైన నటుడు గెటప్ శ్రీను. ఇప్పుడు తను హీరోగా వస్తున్న సినిమా రాజు యాదవ్. ట్రైలర్ చూశాను. చాలా బావుంది. కొత్తదనం కనిపించింది. శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, వినోదం పంచుతుంది. శ్రీనుని చూస్తుంటే నాకు గతంలో కామెడీ హీరో చలం గారు గుర్తుకువస్తారు. చలం గారిని ఆంధ్ర దిలీప్ కుమార్ అని పిలిచేవారు. మన గెటప్ శ్రీను కూడా నాకు అలానే అనిపిస్తారు. గెటప్ శ్రీను ప్రతిభకు హద్దులు లేవని అనిపిస్తుంటుంది. మే 24న విడుదలయ్యే రాజు యాదవ్ చిత్రం మీ మెప్పు పొందుతుందని, తను హీరోగా మీ మన్ననలని అందుకుంటాడని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నిర్మాతలకు, దర్శకుడు కృష్ణమాచారికి, యూనిట్ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. శ్రీను ఆల్ ది వెరీ బెస్ట్’అని తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి.        

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.  

స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్  ఈ చిత్రానికి అద్భుతమైన ఆల్బమ్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.  

రాజు యాదవ్.. లవ్, కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో అలరించనుంది.  

సాయిరామ్ ఉదయ్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్.  

నటీనటులు: గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల, శ్రీరామ్, కళ్యాణ్ భూషణ్, శ్రీమణి, పవన్ రమేష్, ఉత్తర ప్రశాంత్, తదితరులు..

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: కృష్ణమాచారి. కె
నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి
ఏపీ, తెలంగాణ రిలీజ్: బన్నీ వాస్
బ్యానర్లు: సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
డీవోపీ: సాయిరామ్ ఉదయ్ D.F.Tech
సాహిత్యం: చంద్రబోస్, కాసర్ల శ్యామ్
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగేళా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విప్లవ్
గాయకులు: చంద్రబోస్, రామ్ మిరియాల, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, యసస్వి కొండేపూడి
కొరియోగ్రఫీ: జిత్తు మాస్టర్
పీఆర్వో:  వంశీ – శేఖర్
సోషల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ద్వారా గ్లోబల్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోన్న ‘రాకాస’.. ఓవర్సీస్‌లో 350కి పైగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల

అథర్వణ భద్రకాళి పిక్చర్స్ అధికారికంగా ‘రాకాస’ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను పొందింది. ‘రాకాసా’ వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ మీద ముద్రను…

17 hours ago

హే భగవాన్‌ నవ్విస్తుంది.. హృదయానికి హత్తుకుంటుంది: సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ వంశీ నందిపాటి

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

1 day ago

“కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్రభాస్ గారు ప్రశంసించడం నేను గెలిచాననే ఫీల్ కలిగించింది – సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో సంతోష్ శోభన్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా ఈ రోజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు…

1 day ago

‘బ్యాండ్ మేళం’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’.…

1 day ago

కపుల్ ఫ్రెండ్లీ మూవీని ప్రశంసిస్తూ ఇన్ స్టా పోస్ట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ…

1 day ago

పురుష: నుంచి చాటు చాటు సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ట్యూన్

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న కొత్త సినిమా ‘పురుష:’. పక్కా ఫ్యామిలీ…

1 day ago