రాఘ‌వ లారెన్స్ పాన్ ఇండియా సూప‌ర్ హీరో ఫిల్మ్ ‘కాల భైరవ’

రాక్ష‌సుడు, ఖిలాడి వంటి చిత్రాల‌ను రూపొందించ‌న ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఇప్పుడు ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై మ‌రో ప్రెస్టీజియ‌స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి, గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్‌, నీలాద్రి ప్రొడ‌క్ష‌న్స్‌, హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.

వైవిధ్య‌మైన పాత్ర‌లు, చిత్రాల‌తో మెప్పిస్తోన్న డైన‌మిక్ స్టార్ రాఘ‌వ లారెన్స్ ఇందులో హీరోగా న‌టిస్తున్నారు. కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్‌గా త‌న‌దైన ముద్ర వేసిన లారెన్స్‌ కెరీర్‌లో 25వ చిత్రంగా ఇది రూపొందుతుండ‌టం విశేషం. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ రాక్ష‌సుడు, సెన్సేష‌న‌ల్ మూవీ ఖిలాడి వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

ప్ర‌స్తుతానికి ఈ యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ మూవీ నిర్మాణాత్మ‌క ద‌శ‌లో ఉంది. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రాఘ‌వ లారెన్స్ లుక్ అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతోంది.

RL25 చిత్రానికి ‘కాల భైరవ’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఫ‌స్ట్ లుక్‌ను గ‌మనిస్తే ఇంట్రెస్టింగ్ అంశాల‌ను గ‌మ‌నించ‌వ్చు. ‘ది వ‌ర‌ల్డ్ విత్ ఇన్‌’, ‘ఏ ప్యాన్ ఇండియా సూప‌ర్ హీరో ఫిల్మ్’ వంటి లైన్స్ అంచ‌నాల‌ను ఆకాశానికెత్తేస్తున్నాయి. రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని కోనేరే స‌త్య‌నారాయ‌ణ‌, మనీష్ షా అత్యంత భారీగా రూపొందిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత గొప్ప సినిమాను చూడ‌లేద‌నేంత గొప్ప థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కు అందించ‌టానికి మేక‌ర్స్ ప్ర‌తీ విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ‘కాల భైరవ’ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. న‌వంబ‌ర్ నుంచి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2025 వేస‌విలో సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్నివివ‌రాల‌ను మేక‌ర్స్ తెలియ‌జేస్తారు

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago