బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన పుష్ప 2 సినిమా నేడు ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారింది. భారతదేశ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ కలెక్షన్స్ తో మరో కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికీ 2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్ మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ 233 కోట్లు కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఈ రికార్డును మార్చివేసింది. మొదటి రోజే 294 గ్రాస్ కలెక్షన్స్ తో కొత్త రికార్డు సృష్టించింది. గత రికార్డులు అన్నింటినీ తిరగరాస్తూ సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాగా నిలిచింది. నైజంలో ఆర్ఆర్ఆర్ చిత్రం మొదటి రోజు 23 కోట్లు కలెక్ట్ చేయగా అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం 30 కోట్లు కలెక్ట్ చేస్తూ నైజాం రికార్డు కూడా తిరగరాస్తూ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.
అదేవిధంగా హిందీలో ఎన్నడూ లేని విధంగా టాప్ సినిమాగా రికార్డు సృష్టించింది. మొదటి రోజు 72 కోట్ల కలెక్షన్స్ తో హిందీ సినిమా చరిత్ర లోనే నూతన రికార్డ్ క్రియేట్ చేసింది..డే వన్ రికార్డులో అల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది.పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాదు, తెలుగువారి కీర్తి కూడా పెంచే స్థాయిలో భారీ బ్లాక్ బుస్టర్ హిట్ కొట్టింది.
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…