నటనపై దృష్టి సారిస్తూ కొత్త ప్రయాణం మొదలుపెట్టిన నిర్మాత యష్ రంగినేని

బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫోటో స్టూడియో వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి నిర్మాతగా మంచి అభిరుచి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు యష్ రంగినేని. ఈ రోజు ఆయన తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

ఇటీవల నటుడిగా కూడా ఆయన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. రోషన్ మేక హీరోగా నటించిన ఛాంపియన్ చిత్రంలో యష్ రంగినేని కీలక పాత్రలో కనిపించారు. ఇందులో మాల వీరయ్య పాత్రలో ఆయన చేసిన నటనకు మంచి స్పందన లభించింది.

యష్ రంగినేనితో పని చేసిన కొంతమంది దర్శకులు కూడా ఆయన నటన గురించి ఆసక్తికరంగా మాట్లాడుతున్నారు. ఒక దర్శకుడు మాట్లాడుతూ, “యష్ గారికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఆయన వ్యక్తిత్వం, బాడీ లాంగ్వేజ్ వల్ల తెరపై కనిపించే సన్నివేశాలకు ఒక ప్రత్యేకమైన ప్రభావం వస్తుంది” అని అన్నారు.

మరో దర్శకుడు మాట్లాడుతూ, “నిర్మాతగా ఇప్పటికే మంచి అభిరుచి ఉన్న వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటుడిగా కూడా పాత్రను అర్థం చేసుకుని పనిచేయడానికి ప్రయత్నిస్తున్నారు” అని చెప్పారు.

ఇంకొక దర్శకుడు మాట్లాడుతూ, “ఆయన ఫిట్‌నెస్, డెడికేషన్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కెమెరా ముందు చాలా నేచురల్‌గా కనిపిస్తారు. ముఖ్యంగా ఇంటెన్స్ పాత్రలకు ఆయన బాగా సూట్ అవుతారు” అని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే కొన్ని చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం యష్ రంగినేనిని సంప్రదిస్తున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయని సమాచారం.

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

3 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago