శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా జూన్ 7న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా..
చిత్ర దర్శక నిర్మాత షిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘యువతలో చాలా మంది నిజమైన ప్రేమ, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తున్నారు. ఇది వారి జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతోందనే పాయింట్‌లో ‘ప్రేమించొద్దు’ సినిమాను తెరకెక్కించాం. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న తొలి ఇండిపెండెట్ మూవీ. అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తోన్న సినిమా కావటంతో సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 7న స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ ద్వారా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
నటీనటులు:
అనురూప్, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శత్వం – శిరిన్ శ్రీరామ్, మ్యూజిక్ ప్రోగ్రామింగ్ – జునైద్ కుమార్, బ్యాగ్రౌండ్ స్కోర్ – కమ్రాన్, సాంగ్స్ కంపోజింగ్ – చైతన్య స్రవంతి, సినిమాటోగ్రఫీ అండ్ కలర్ – హర్ష కొడాలి, స్క్రీన్ ప్లే – షిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం, అసోసియేట్ డైరెక్టర్ – సోనాలి గర్జె, పబ్లిసిటీ డిజైన్ – అజయ్(ఏజే ఆర్ట్స్), వి.ఎఫ్.ఎక్స్- వి.అంబికా విజయ్, లొకేషన్ సౌండ్ – మహేష్ పాశం, డబ్బింగ్ ఇంజనీర్ – అనూప్ చౌదరి, పి.ఆర్.ఒ – చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…