మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సానా, వెంకట సతీష్ కిలారు, ఎ.ఆర్. రెహమాన్ ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అదిరిపోయే ప్రోమో రిలీజ్, లిరికల్ వీడియో నవంబర్ 7న రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రకు ప్రాణం పోసేందుకు రామ్ చరణ్ అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసింది.  

మరింత ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్- చికిరి చికిరి ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో, దర్శకుడు బుచ్చి బాబు సానా, అకాడమీ అవార్డు విన్నింగ్ కంపోజర్ ఎ.ఆర్. రెహమాన్ పట్ల తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకుంటూ, పాట సందర్భాన్ని వివరిస్తూ ప్రారంభమవుతుంది. కొండల మధ్య నివసించే హీరో, ఒక అమ్మాయిని చూసిన వెంటనే  ఉప్పొంగే భావోద్వేగం సంగీతంగా, సంబరంగా వెలువడుతుందని సందర్భాన్ని వివరించారు.

హీరో అమ్మాయిని ‘చికిరి’ అని పిలుచుకోవడం ఈ పాటకు ప్రాణం అయింది. రెహమాన్ సృష్టించిన హై వోల్టేజ్ బీట్‌లకు అనుగుణంగా రామ్ చరణ్ తన సిగ్నేచర్ మాస్ డాన్స్ స్టైల్‌, ఎనర్జీ తో అదరగొట్టారు. ఈ పాటలో చరణ్ హుక్‌స్టెప్ క్షణాల్లో వైరల్ అయ్యింది.  

నవంబర్ 7న విడుదల కాబోతున్న ‘చికిరి చికిరి’ లిరికల్ వీడియో కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కాన్సెప్ట్ వీడియోతోనే ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెరిపోయింది. రెహమాన్ సంగీతం, చరణ్ స్టెప్స్, బుచ్చిబాబు మార్క్ తో ఈ ఆల్బమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, చరణ్ ప్రేమికురాలు‘చికిరి’గా కనిపించనుంది.  శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  

ఈ సినిమాకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు డీవోపీ కాగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్.

పెద్ది మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: బుచ్చిబాబు సానా
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago