బాహుబలి పళని దర్శకత్వంలో వెంకటేష్ పెద్దపాలెం హీరోగా నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం ‘వన్ బై ఫోర్’ (ONE/4)!

బాహుబలి పళని దర్శకత్వంలో, వెంకటేష్ పెద్దపాలెం, టెంపర్ వంశీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్-క్రైమ్ డ్రామా చిత్రం ‘వన్ బై ఫోర్’ (ONE/4)!తేజస్ గుంజల్ ఫిలిమ్స్ మరియు రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ పతాకంపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్ మరియు హీనా సోని హీరో, హీరోయిన్స్ గా మరియు టెంపర్ వంశి, ఆర్ ఎక్స్ 100 కరణ్ విలన్స్ నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్ (one/4). భారీ బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్  మరియు రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ తో సిద్ధంగా ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.ఈ సందర్భంగా దర్శకుడు నిర్మాతలు మాట్లాడుతూ ” వన్ బై ఫోర్ (one/4) ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం. షూటింగ్ మొత్తం వైజాగ్ లో జరిగింది. నోరు జారితే జరిగే పరిణామాలు వాటివల్ల వచ్చే సమస్యలు ఎలాఉంటాయో చెప్పే కథే మా వన్ బై ఫోర్ (one/4) చిత్రం కథ.సినిమా చాలా కొత్తగా ఫ్రెష్ గా ఉంటుంది. మంచి థ్రిల్లింగ్ కథ తో అద్భుతమైన క్రైమ్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించాం. టీజర్ మరియు పాటలు టి సిరీస్ యూట్యూబ్ లో విడుదల చేసాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా క్రేజీ గా కొత్త గా ఉంటుంది, సెప్టెంబర్ విడుదల చేస్తాం” అని తెలిపారు. చిత్రం పేరు: వన్ బై ఫోర్ (one/4)నటి నటులు: వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని, టెంపర్ వంశీ, ఆర్ ఎక్స్ 100 కరణ్, నరేంద్ర వర్మ, రాజు, అపర్ణ శెట్టి, మధుసూదన్ రావు, సునీత మనోహర్, శ్రీనివాస్ భోగిరెడ్డి, వేడిష్ జవేరి, కుష్బూ, సుజాత, ఎస్ ఆర్ ఎస్ వర్మ, సుహాని వ్యాస్, తదితరులు దర్శకుడు: బాహుబలి పళని కె నిర్మాతలు: రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్సంగీతం: సుభాష్ ఆనంద్డి ఓ పి: గుణ శేఖర్లిరిక్స్: సాగర్ నారాయణ ఎమ్. నాగేంద్ర గోపుడాన్స్: సాగర్ వేలూరుస్టంట్ మాస్టర్: కుంగ్ ఫు చంద్ర, జాషువావి ఎఫ్ ఎక్స్: నవీన్ ఏ, పవన్ నారావాఎస్ ఎఫ్ ఎక్స్: పురుషోత్తం రాజుమిక్సింగ్: జయంతం సురేష్డిజిటల్ మార్కెటింగ్: వంశి కృష్ణ (సినీ డిజిటల్)

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

3 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago