‘దేవర’ను బ్లాక్ బస్టర్ సక్సెస్ చేసినందుకు ప్రేక్షకుల కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సెప్టెంబర్ 27  విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన దేవర చిత్రానికి ఆడియెన్స్ మరుపురాని హిట్‌ను అందించారు. సైఫ్ అలీ ఖాన్ భైరాగా, జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్‌గా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌ల మీద కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మించారు.

దేవర మూవీ క్వాలిటీ, నిర్మాణ విలువలు, ఆకర్షణీయమైన కథనం, ప్రచార కార్యక్రమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్‌ను సాధించాయి. 500 కోట్లకు పైగా వసూలు చేసి గణనీయమైన లాభాలను ఆర్జించింది. ఈ అద్భుతమైన విజయం ఎన్టీఆర్‌కు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు, చిత్ర బృందానికి, మీడియాకు ఎన్టీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

ఆ ప్రెస్ నోట్‌లో నటుడు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వంటి వారు పాత్రలకు ప్రాణం పోయడం, దర్శకుడు కొరటాల శివ తన అద్భుతమైన విజన్, టీమ్‌ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని అన్నారు.

దేవర కోసం పని చేసిన సాంకేతిక నిపుణులను ఎన్టీఆర్ అభినందిస్తూ.. సినిమా విజయవంతమవడానికి అవసరమైన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను అభినందించారు. సినిమా విజయానికి ముఖ్య సహకారం అందించిన నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కొసరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు, సినిమాను ఆస్వాదించిన ప్రేక్షకులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

‘దేవర పార్ట్ 1కి వచ్చిన ఆదరణ, కురిపిస్తున్న ప్రేమను చూసి నాకు ఎంతోగానో సంతోషం వేస్తోంది. ఈ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఇంత స్పెషల్ అయిన చిత్రానికి మీ అందరూ ప్రేమను, సపోర్ట్‌ను ఇచ్చి బ్లాక్ బస్టర్ చేయడం చూసి మరింత ఆనందం వేస్తోంది. నా సహ నటులు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్.  పాత్రలకు ప్రాణం పోసిన ఆర్టిస్టులందరికీ థాంక్స్. ఇంత గొప్ప ప్రపంచాన్ని క్రియేట్ చేసిన కొరటాల శివ గారికి థాంక్స్.  ఆయన నాయకత్వం, దర్శకత్వంతో దేవర విజన్ రియాల్టీలోకి వచ్చింది. అనిరుధ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేవర చిత్రానికి ఆయన బ్యాక్ బోన్‌లా నిలబడ్డారు. రత్నవేలు సర్ ప్రతీ ఫ్రేమ్‌ను అద్భుతంగా తీర్చి దిద్దారు. సాబు సిరిల్ సర్ అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ గారి వీఎఫ్ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ ఇలా అందరూ కలిసి దేవరను ఓ అద్భుతంగా మార్చారు.

థియేటర్లో ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి కారణమైన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు థాంక్స్. ఇంతగా సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి థాంక్స్. దేశ వ్యాప్తంగా దేవరను ఇంత బాగా కవర్ చేసిన మీడియాకు థాంక్స్. నా నిర్మాత సుధాకర్ మిక్కిలి సుధాకర్ గారికి థాంక్స్. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అవ్వడానికి ఇంత బాగా రావడానికి కారణమైన హరికృష్ణ కొసరాజు గారికి థాంక్స్. మా కంటే ఈ సినిమాను ఎక్కువగా సెలెబ్రేట్ చేసిన ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు, సినిమా ప్రేక్షకులకు థాంక్స్. మీ ప్రేమాభిమానాలను చూసి నా నోట మాట రాలేదు. నా వెన్నంటే ఉంటూ నాకు అంతులేపి ప్రేమను, సపోర్ట్ ఇస్తున్న నా అభిమానుల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను.  మీరు చూపించే ప్రేమ వల్లే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే నాకు ఎప్పుడూ ధైర్యాన్ని, శక్తిని ఇస్తుంటుంది. మీకు నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. మీ అందరినీ గర్వపడేలా చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాను. దేవర పార్ట్ 1ను మీ భుజానికి ఎత్తుకుని ఇంత పెద్ద ఘన విజయాన్ని అందించినందుకు థాంక్స్’ అని ఎన్టీఆర్ అన్నారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

3 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago