NKR21- 1000 మంది ఆర్టిస్టులుతో ఇంటెన్స్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి

హీరో నందమూరి కళ్యాణ్ రామ్  #NKR21 సినిమా క్లైమాక్స్ షూటింగ్ తాజాగా పూర్తయింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలోని ఈ క్రూషియల్ పార్ట్  హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ముప్పై రోజుల పాటు చిత్రీకరించారు. ఈ కీలక సన్నివేశానికి అవసరమైన డ్రమటిక్, లీనమయ్యే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేకర్ భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఒక్క క్లైమాక్స్‌కే రూ. 8 కోట్లు ఖర్చు చేశారు. ఇది ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కెరీర్‌లో  హయ్యస్ట్ ఖర్చు పెట్టిన  క్లైమాక్స్. ఇది గ్రాండియర్, హ్యూజ్ స్కేల్ లో వుండబోతోంది.

అద్భుతమైన సెట్స్ రూపొందించడంలో పేరున్న  బ్రహ్మ కడలి మ్యాసీవ్ సెట్ డిజైన్‌ చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీని రామకృష్ణ పర్యవేక్షించారు. యాక్షన్  సన్నివేశాలు, స్టంట్లు బ్రెత్ టేకింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నాయి.

క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ప్రముఖ తారాగణం మాత్రమే కాకుండా దాదాపు 1000 మంది ఆర్టిస్టులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ఫైనాన్సియల్, క్రియేటివ్ సోర్స్ లో గ్రేట్ ఇన్వెస్ట్ మెంట్ సూచిస్తోంది. సినిమా నెరేటివ్ లో ఈ పార్ట్ హైలైట్ గా వుండబోతోంది.

హై-ఆక్టేన్ యాక్షన్‌తో కూడిన ఈ చిత్రంలో విజయశాంతి IPS ఆఫీసర్‌గా కమాండింగ్ క్యారెక్టర్ లో తన డైనమిక్  ప్రెజెన్స్ తో ఆకట్టుకోనున్నారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.  

ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ : రామ్ ప్రసాద్
బ్యానర్స్: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎడిటర్: తమ్మిరాజు
సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
యాక్షన్: రామకృష్ణ
పీఆర్వో : వంశీ-శేఖర్, వంశీ కాకా
మార్కెటింగ్: ఫస్ట్ షో

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago