యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్వామి రారా, కేశవ వంటి సూపర్ డూపర్ సక్సెస్‌ల తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో రూపొందుతోన్న హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఇది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, రెండు సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ప్రారంభమైన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే ఇందులో హీరో నిఖిల్ రిషి అనే రేసర్ పాత్రలో కనిపించనున్నారు. తనకు లవ్ స్టోరీస్ ఉంటాయి. రుక్మిణి వసంతన్ డబ్బు కోసం ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అలాగే దివ్యాంశ కౌశిక్‌తోనూ మరో ప్రేమ కథ ఉంటుంది.
రిషికి అనుకోకుండా డబ్బు మరో పని చేయడానికి ఒప్పుకుంటాడు. దీంతో అసలు గందరగోళం ప్రారంభమవుతుంది. ఓ చచ్చిన వ్యక్తిని తరలించటానికి రిషి సిద్ధమైనప్పుడు ఏం జరుగుతుంది. ఓ వైపు పోలీసులు, మరో వైపు గూండాలు అతన్ని వెంబడిస్తారు. చాలా సమస్యలు చుట్టుముడతాయి. అప్పుడు తన రేసింగ్ నైపుణ్యంతో వారి నుంచి రిషి ఎలా బయటపడ్డాడు. ఇంతకీ రిషి ఎవరి డెడ్ బాడీని తరలించాలని అనుకున్నాడు? అజయ్, జాన్ విజయ్.. రిషిని వెంబడించటానికి ఏ పరికరాన్ని వాడుతుంటారు? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
ఇదే ట్రైలర్‌లో సత్య, సుదర్శన్ పాత్రలను కూడా మనం చూడొచ్చు. నరాలు బిగపట్టేలా చేజింగ్ సన్నివేశాలు సినిమాలో ఉండబోతున్నాయి. సినిమాను ఉత్కంఠభరితమైన యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కించారు. యాక్షన్, రొమాన్స్, ఫన్ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ఈ సినిమాతో ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందనున్నారు.
బాపినీడు.బి సమర్పణలో శ్రీవెకంటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి సంస్థపై ప్రముఖ సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దీన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్ ఈ చిత్రంతో తెలుగులోకి పరిచయం అవుతున్నారు. యోగేష్ సుధాకర్, సునీల్, షా, రాజా సుబ్రమణ్యం సహ నిర్మాతలు. సింగర్ కార్తీక్ ఈ చిత్రంలోని పాటలకు సంగీతాన్ని అందించగా సన్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేశారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…