స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ‘కంగువ’ సినిమా నుంచి ‘నాయకా..’ లిరికల్ సాంగ్ విడుదల చేశారు.
‘నాయకా..’ లిరికల్ సాంగ్ కు దేవిశ్రీ ప్రసాద్ పవర్ ఫుల్ ట్యూన్ కంపోజ్ చేయగా..రాకేందు మౌళి లిరిక్స్ అందించారు. అరవింద్ శ్రీనివాస్, దీపక్ బ్లూ, శెంబగరాజ్, నారాయణ్ రవిశంకర్, గోవింద్ ప్రసాద్, శిబి శ్రీనివాసన్, ప్రసన్న అభిశేష, సాయిశరణ్, విక్రమ్ పిట్టి, అభిజిత్ రావ్, అపర్ణ హరికుమార్, సుస్మిత నరసింహన్, పవిత్ర చారి, లవిత లోబో, దీప్తి సురేష్, లత కృష్ణ, పద్మజ శ్రీనివాసన్ పాడారు. ‘నాయకా మా నాయకా నాయకా మా నాయకా..ధీర ధీర కదన విహార ధీర రారా అగ్ని కుమారా…’ అంటూ తమ నాయకుడి గొప్పదనాన్ని పొగుడుతూ తెగ ప్రజలు పాడుకునే పాటగా ఈ సాంగ్ ను డిజైన్ చేశారు.
నటీనటులు – సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ – వెట్రి పళనిస్వామి
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ
అక్టోబర్ 30, 2024: తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, సినిమాల్లో అద్భుతమైన నటనతో అలరిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార…
Nandamuri Taraka Ramarao, the great-grandson of the legendary NTR, grandson of the esteemed Hari Krishna,…
డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి, యలమంచిలి గీత, న్యూ టాలెంట్ రోర్స్ @ నుంచి గ్రేస్ఫుల్ నందమూరి తారక రామారావు…
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బఘీర'తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ…
Producer Naga Vamsi is one of the most active and popular producers of Telugu Cinema.…
తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కమర్షియల్ చిత్రం 'లక్కీ భాస్కర్' : నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఒక వైపు…