‘ది పారడైజ్’ నుంచి జడల్ గా నేచురల్ స్టార్ నాని పవర్ ఫుల్ పోస్టర్ న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్



నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’ ప్రతి అప్‌డేట్ ఈ సినిమా కోసం ఎక్సయిట్మెంట్ మరింతగా పెంచుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLV సినిమాస్  సుధాకర్ చెరుకూరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. మేకర్స్ రిలీజ్ చేసిన నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది.

మేకర్స్ న్యూ ఇయర్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నాని జడల్ పాత్రలో పవర్ ఫుల్ గా, తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఓ కొత్త అవతార్ లో కనిపిస్తున్నారు.  

స్ట్రాంగ్ ఫిజిక్, పొడవైన జడలు కట్టిన జుట్టు, రగ్గడ్ గడ్డం, మీసాలతో నాని లుక్ అదిరిపోయింది. రెడ్ టింట్ గ్లాసులు, మెటల్ చైన్స్, స్లీవ్‌లెస్ బ్లాక్ అవుట్‌ఫిట్ అతని పాత్రలోని ఇంటెన్సిటీని చూపిస్తోంది.

ఈ పోస్టర్ సినిమాలో కీలకమైన జైలు ఫైట్ సీన్‌కి సంబధించినది. ఫారిన్ ఫైటర్లతో జరిగే హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ఇది, కథను కీలక మలుపు తిప్పే ప్రధాన ఘట్టాల్లో ఒకటిగా నిలవనుంది. దసరాతో పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఈ సినిమాను కూడా అదే స్థాయిలో రా, రగ్డ్, రియలిస్టిక్ టోన్‌తో రూపొందిస్తున్నారని ఈ పోస్టర్ స్పష్టంగా తెలియజేస్తోంది.

ఈ చిత్రానికి సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటింగ్‌  నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌ అవినాష్ కొల్లా.

ఈ సినిమా 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది. ది ప్యారడైజ్ ఇండియన్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునే పాన్-వరల్డ్ స్పెక్టకిల్‌గా నిలవనుంది.

తారాగణం: నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: సిహెచ్ సాయి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago