‘కార్తికేయ2’ కి నేషనల్ అవార్డ్ రావడం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి మైల్ స్టోన్ మూమెంట్: టీజీ విశ్వప్రసాద్

‘కార్తికేయ2’ చిత్రానికి నేషనల్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా వుంది. కృష్ణ ఈజ్ ట్రూత్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది: నిర్మాత అభిషేక్ అగర్వాల్

నేషనల్ అవార్డ్ మరింత భాద్యత పెంచింది. కార్తికేయ3 అంచనాలని అందుకునేలా వుంటుంది: డైరెక్టర్ చందూ మొండేటి

‘కార్తికేయ2 చిత్రానికి నేషనల్ అవార్డ్ రావడం మా సంస్థకు మైల్ స్టోన్ మూమెంట్”అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కార్తికేయ2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రం(తెలుగు)గా నేషనల్ అవార్డ్  గెలుచుకుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. కార్తికేయ2 చిత్రానికి నేషనల్ అవార్డ్ రావడం మా సంస్థ పీపుల్ మీడియాఫ్యాక్టరీకి మైల్ స్టోన్ మూమెంట్. ఇది మా మొదటి నేషనల్ అవార్డ్. మా అభిషేక్ కి సెకండ్ నేషనల్ అవార్డ్. ఈ సందర్భంగా నిఖిల్ కి థాంక్స్ చెబుతున్నాను. నిఖిల్ మాకు డైరెక్టర్ చందూ మొండేటి గారితో పరిచయం చేశారు. కార్తికేయ2 అభిషేక్, మేము కలసి చేసిన సినిమా. కార్తికేయ2 మొదలుపెట్టినప్పుడే పెద్ద సినిమా అనుకున్నాం. కానీ ఇంత సక్సెస్ వస్తుందని ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులే కాకుండా పాన్ ఇండియాతో యూస్ ఆడియన్స్ అద్భుతంగా ఆదరించారు. ఈ రోజు మైల్ స్టోన్ నేషనల్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా వుంది. మా సంస్థకు ఇది చాలా గొప్ప విషయం. కార్తికేయ3 డెఫినెట్ గా వుంటుంది’అన్నారు.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. కృష్ణ ఈజ్ ట్రూత్. ఈ రోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డ్ కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా సినిమాలన్నిటికీ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. నిఖిల్ గారు చందూ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు, వారితో మా కొలాబరేషన్ కొనసాగుతుంది’ అన్నారు.

డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ… కార్తికేయ2 అద్భుత విజయం సాధించినప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యామో ఇప్పుడు అదే ఫీలింగ్ లో వున్నాం. నేషనల్ అవార్డ్ మరింత భాద్యతని పెంచింది. కార్తికేయ3 ఖచ్చితంగా వుంటుంది. ప్రస్తుతం రైటింగ్ లో వుంది. కార్తికేయ2 తర్వాత దానిపై అంచనాలు ఎంతలా పెరిగాయో మాకు తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా కార్తికేయ3 వుంటుంది. నేషనల్ అవార్డ్ రావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. థాంక్ యూ జూరీ మెంబర్స్. జై శ్రీకృష్ణ’ అన్నారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago