‘హాయ్ నాన్న’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల

నేచురల్ స్టార్ నాని డిఫరెంట్ జోన్ లో వున్నారు. ప్రతిసారీ తన సినిమాల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా చిత్రానికి  కోర్ పాయింట్‌ గా తండ్రీ-కూతురు భావోద్వేగాలతో కూడిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నారు. నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ముందుగా చెప్పినట్లు ఈ రోజు మేకర్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను విడుదల చేశారు.  

ఈ చిత్రానికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ‘హాయ్ నాన్న’ అనే ప్లజంట్ టైటిల్‌ను పెట్టారు. హిందీలో ‘హాయ్ పాపా’ అనే టైటిల్‌ను లాక్ చేశారు. ఫస్ట్‌ లుక్ పోస్టర్ టైటిల్ లానే ప్లజంట్ గా వుంది .నాని భుజాలపై కూర్చున్న పాప,  వెనుక నిలబడిన మృణాల్‌కి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. నాని, మృణాల్ ఇద్దరూ చేతిలో మొబైల్ ఫోన్లు పట్టుకుని కనిపిస్తున్నారు. నాని బిజీబిజీగా కనిపిస్తుండగా, మృణాల్ తన ముఖంపై అందమైన చిరునవ్వుతో ముద్దును క్యాచ్ చేస్తూ కనిపించారు. నాని లిటిల్ ప్రిన్సెస్ లుక్స్ చాలా అందంగా వుంది. క్యాజువల్ డ్రెస్సింగ్ లో గిరజాల జుట్టు, లేత గడ్డంతో క్లాసీ లుక్‌లో కనిపించారు నాని. బటన్-డౌన్ మ్యాక్సీ డ్రెస్‌లో మృణాల్ అందంగా కనిపించింది. నాని, మృణాల్ చూడముచ్చటగా ఉన్నారు.

గ్లింప్స్ విషయానికి వస్తే, మృణాల్ పాప స్నేహితురాలిగా, తర్వాత నాని పాప తండ్రిగా పరిచయం అవుతారు. చివరిగా, ముగ్గురూ లంచ్ కోసం కలుస్తారు, మృణాల్ తనను తాను నానికి పరిచయం చేసుకుని, ‘హాయ్ నాన్న’ అని పిలవడంతో గ్లింప్స్ ముగుస్తుంది. స్క్రీన్‌పై మంచి పెర్ఫార్మర్స్ ఉన్నప్పుడు, ఎమోషన్ సహజంగానే చక్కగా పండుతుంది.  ఇందులో నాని, మృణాల్‌ లు అద్భుతంగా నటించారు. పాప అందరినీ ఆకట్టుకుంది.

నూతన దర్శకుడు శౌర్యువ్ చిన్న గ్లింప్స్ తో మనల్ని భావోద్వేగానికి గురిచేశాడు. హేషామ్ అబ్దుల్ వహాబ్ మనసుని కదిలించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఎమోషన్‌ జోడించారు. సాను జాన్ వరుగీస్ ISC మాస్టర్ వర్క్ విజువల్స్‌లో కనిపిస్తుంది. ఓవరాల్ గా టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తండ్రీకూతుళ్ల భావోద్వేగానికి భాష అడ్డంకి కాదు. సినిమా అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది.

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సిఒఒగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు.  

యూనిక్ స్టొరీ లైన్ తో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: నాని, మృణాల్ ఠాకూర్  
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: శౌర్యువ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి
బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్స్
సిఒఒ: కోటి పరుచూరి
డీవోపీ: సాను జాన్ వర్గీస్ ISC
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ప్రొడక్షన్ డిజైనర్:  అవినాష్ కొల్లా
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఈవీవీ సతీష్
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

యంగ్‌ టీమ్‌ ఎనర్జీతో రూపొందించిన ‘శ్రీ చిదంబరం గారు’ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను: లెజెండరీ మ్యూజిక్‌ డెరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…

5 hours ago

అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ – టికెట్ ధర కేవలం 100,150 మాత్రమే

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…

6 hours ago

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ “కిల్లర్” నుంచి పవర్ ఫుల్ విలన్ మనీష్ గిలాడ క్యారెక్టర్ లుక్ రిలీజ్

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…

6 hours ago

ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై”

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…

6 hours ago

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ భేటీ: ‘పద్మశ్రీ’ వచ్చినందుకు ఘన సత్కారం

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…

1 day ago