న్యూ ఇయర్ సందర్భంగా ‘అమిగోస్’ నుంచి నందమూరి కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ విడుదల చేసిన మేకర్స్

బింబిసార‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సత్తా చాటిన నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ళ్యాణ్ రామ్‌. ఈయ‌న మ‌రో డిఫ‌రెంట్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించ‌టానికి క‌ళ్యాణ్ రామ్ ఆస‌క్తి చూపిస్తుంటారు. త‌న‌దైన పంథాలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘అమిగోస్’. డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేంద్ రెడ్డితో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ రూపొందుతోన్నఈ చిత్రం టైటిల్ వినగానే అందరినీ ఆకట్టుకుంది. అమిగోస్ అంటే ఫ్రెండ్‌ను పిలిచే స్పానిష్ ప‌దం. రాజేంద‌ర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. 

ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన క‌ళ్యాణ్ రామ్ పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగా.. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా అమిగోస్ మూవీ నుంచి నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ లుక్ మ‌రో పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో ఆయ‌న మీసాలు తిప్పుకుని స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. త‌న పాత్ర పేరు సిద్ధార్థ్ అని పోస్ట‌ర్‌లో తెలుస్తుంది. దానిపై మ‌నిషిని పోలిన మ‌నిషి అని అర్థం వ‌చ్చేలా డోప‌ల్ గ్యాంగ‌ర్ అని రాశారు. దానికి వెనుక అస‌లు విష‌యం తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందేంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 

క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.  ‘అమిగోస్’ నిర్మాణం ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. దీంతో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తోనూ టీమ్ బిజీగా ఉంది. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 10, 2023న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.  

ఎన్నో సెన్సేష‌న‌ల్ మూవీస్‌ను అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న‌ ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్‌కు జోడీగా ఆషికా రంగ‌నాథ్ న‌టిస్తుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా.. త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వర్క్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, ఆషికా రంగ‌నాథ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

నిర్మాణ సంస్థ‌:  మైత్రీ మూవీ మేకర్స్‌

నిర్మాత‌లు:  న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  రాజేంద్ర రెడ్డి

సంగీతం:  జిబ్రాన్‌

సినిమాటోగ్ర‌ఫీ:  సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  అవినాష్ కొల్ల‌

ఎడిట‌ర్‌:  త‌మ్మిరాజు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  హ‌రి తుమ్మ‌ల‌

కొరియోగ్రాఫ‌ర్‌:  శోభి

ఫైట్ మాస్ట‌ర్స్:  వెంక‌ట్, రామ్ కిష‌న్‌

పాట‌లు:  స్వ‌ర్గీయ శ్రీ వేటూరి, రామ‌జోగ‌య్య శాస్త్రి, రెహ‌మాన్‌,

సి.ఇ.ఓ:  చెర్రీ

కో డైరెక్ట‌ర్‌:  చ‌ల‌సాని రామారావు

కాస్ట్యూమ్స్‌:  రాజేష్, అశ్విన్‌

ప‌బ్లిసిటీ డిజైన్‌:  గోపి ప్ర‌స‌న్న‌

పి.ఆర్‌.ఓ:  వంశీ కాక

TFJA

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

8 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago