నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘తండేల్’. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా హీరో నాగ చైతన్య సినిమాలోని ఒక ఫోటోని ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో నాగ చైతన్య పల్లెటూరి గెటప్‌లో కనిపిస్తున్నారు. చొక్కా , నల్ల ప్యాంటు ధరించి, మెడలో రెడ్ టవల్ తో మ్యాసీ హెయిర్, గుబురు గడ్డం, చేతిలో తాడుతో పడవలో నిలబడి, ఆకట్టుకునే చిరునవ్వుతో మెరుస్తూ కనిపించారు నాగచైతన్య. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది.
తండేల్ లో మత్స్యకారుడి పాత్ర కోసం నాగచైతన్య ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకొని కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. తన యాసపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాలో శ్రీకాకుళం స్లాంగ్‌లో డైలాగులు చెప్పనున్నారు నాగచైతన్య.
ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, షామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్‌దత్
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…