వరుణ్ రాజ్ స్వీయ నిర్మాణం లో, ఆయన హీరో గా నటిస్తున్న సినిమా పోకిరి. ఈ సినిమా లో మమతా హీరోయిన్ కాగా, వికాస్ దర్శకులు. వరుణ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా, ఈ సినిమా లో నుంచి మొదటి పాట ని విడుదల చేసారు.
ఈ సందర్భం గా మాట్లాడుతూ చిత్ర యూనిట్ సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు.
హీరోయిన్ మమత మాట్లాడుతూ, “ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ వికాస్ గారికి, వరుణ్ గారికి తాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే యూనిటీ గుర్తొస్తుంది. ఇదొక మంచి సినిమా. అందరూ ఈ సినిమా ని ఆదరించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
డైరెక్టర్ వికాస్ గారు మాట్లాడుతూ, “మేము స్టోరీ లైన్ రాసుకున్నప్పటి నుంచి పోకిరి అనే టైటిల్ అనుకున్నాం. వేరే టైటిల్స్ పెడదాం అనుకున్నా పోకిరి నే సెట్ అవుతుందని ఈ టైటిల్ సెట్ చేసుకున్నాం.
కథ రాసుకున్నప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకున్నాం. ఈ సినిమా బాగా హిట్ అవుతుందని నమ్ముతున్నాం” అన్నారు.
హీరో మరియు నిర్మాత వరుణ్ రాజ్ మాట్లాడుతూ, “ఈ సినిమా తో గట్టిగా హిట్ కొడతాం. ఈ సినిమా హిట్ అవుతుందని మాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. నేను చిరంజీవి గారికి మహేష్ బాబు గారికి కూడా అంతే అభిమానిని. ఈ సినిమా టైటిల్ లో నే దమ్ముంది. పోకిరి కి ఓనర్ మహేష్ బాబు గారే.
మేమంతా అభిమానులం అంతే!
మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, “ఈ సినిమా కి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడటం కన్నా నా మ్యూజిక్ మాట్లాడితే బాగుంటుంది అని ఆశిస్తున్నాను. మా సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
బ్యానర్: రాజా మూవీస్
టైటిల్: పోకిరి
దర్శకుడు: వికాస్
నిర్మాత: వరుణ్ రాజు
సమర్పకులు: ప్రమోద్ రాజు
హీరో: వరుణ్ రాజు
హీరోయిన్: మమతా రెడ్డి
సంగీతం: ఉదయ్ కిరణ్ UK
కెమెరా: వెంకీ & వంశీ
నటీనటుల: చిత్రమ్ శ్రీను, సూర్య, గంగవ్వ, బెనర్జీ, సత్య ప్రకాష్, మరియు తదితరులు
పి ఆర్ ఓ : మధు విఆర్
"Love Reddy" is a film jointly produced by Geetans Productions, Seheri Studio and MGR Films…
గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "లవ్ రెడ్డి" . అంజన్ రామచంద్ర,…
The film Constable, starring Varun Sandesh in the lead role, is directed by Aryan Subhan…
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లకు ఆడియెన్స్ ఎప్పుడూ మొగ్గు చూపుతూనే ఉంటారు. అలాంటి ఓ ఇంటెన్స్ జానర్ మూవీతో వరుణ్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’.…
The movie Raju Gari Dongalu, featuring Lohith Kalyan, Rajesh Kunchada, Joshith Raj Kumar, Kailash Velayudhan,…