‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ మ్యూజిక్ వీడియో సాంగ్ రిలీజ్

భీమ్స్ సిసిరోలియో సంగీత సార‌థ్యంలో కాస‌ర్ల శ్యామ్‌, శ్రావ‌ణ భార్గ‌వి కాంబోలో ఆక‌ట్టుకుంటోన్న తెలంగాణ జాన‌ప‌ద గీతం

అంద‌రితో శ‌భాష్ అనిపించేలా తెలుగు ఒరిజిన‌ల్ మ్యూజిక్‌ వీడియో సాంగ్స్‌ను ఆడియెన్స్‌కు అందిస్తోన్న సంస్థ నివృతి వైబ్స్‌.

అత్యుత్త‌మ‌మైన ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో ఆడియో, విజువ‌ల్ కంటెంట్‌ను అందించ‌టంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు తానే బెస్ట్ అనిపించుకుంటూ ఈ సంస్థ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది. గ‌డిచిన రెండేళ్ల‌లో తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో నివృతి సంస్థ 50కి పైగా మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించింది. వీటిలో జ‌రీ జ‌రీ పంచెక‌ట్టి.., గుంగులు, సిల‌క ముక్కుదానా, జంజీరే, వ‌ద్ద‌న్నా గుండెల్లో సేరి వంటి పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి.

ఇప్పుడు నివృతి వైబ్స్ నుంచి మ‌రో తెలంగాణ జాన‌ప‌ద పాట మ్యూజిక్ వీడియోగా మ‌న ముందుకు వ‌చ్చింది. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ అంటూ సాగే ఈ పాటలో జయతి ప్రధాన భూమికను పోషించింది. బుల్లి తెరపై వెన్నెల ప్రోగ్రామ్‌తో తిరుగులేని క్రేజ్‌, ఇమేజ్‌ను ద‌క్కించుకున్న జ‌య‌తి ఈ సాంగ్‌లో అద్భుత‌మైన హావ భావాల‌తో, మూమెంట్స్‌లో క‌ట్టి ప‌డేసింది.

ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన సెన్సేష‌న‌ల్ పాట‌ల‌కు సంగీతాన్ని అందిస్తోన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరోలియో ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి…’ సాంగ్ కు సంగీత సారథ్యాన్ని అందించారు. శ్రావణ భార్గవి అద్భుతంగా పాడిన ఈ పాటకు ప్రాణం పోశారు. భాను మాస్ట‌ర్ సాంగ్కి సూప‌ర్బ్‌గా కొరియోగ్ర‌ఫీ చేశారు.లిరిసిస్ట్‌ కాసర్ల శ్యామ్ మరోసారి తన పెన్ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. జ‌య‌తి విజ‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీకోనేటి ఈ పాట‌ను డైరెక్ట్ చేశారు.

యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ డిజిట‌ల్ మాధ్య‌మంలో ఒక బిలియ‌న్ వ్యూస్ ఉన్న ఫ్లాట్‌ఫామ్స్ నివృతి వైబ్స్ సొంతం. శేఖ‌ర్ మాస్ట‌ర్‌, సుద్దాల అశోక్ తేజ, భీమ్స్ సిసిరోలియో, షణ్ముఖ్ జశ్వంత్, మధు ప్రియ, శ్రావణ భార్గవి, దేత్తడి హారిక, లహరి షారి, మానస్, విష్ణు ప్రియ, అనన్య భట్, రాజ్యలక్ష్మి, హారిక నారాయ‌ణ్‌, సాకేత్ కొమందూరి వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో నివృతి వైబ్స్ వ‌ర్క్ చేసింది.

2024 పూర్త‌య్యేస‌రికి 150 పైచిలుకు మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నట్లు నివృతి వైబ్స్ సంస్థ తెలియ‌జేశారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago