మా నాన్న సూపర్ హీరో

నవ దళపతి సుధీర్ బాబు, అభిలాష్ రెడ్డి కంకర, వి సెల్యులాయిడ్స్, CAM ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మా నాన్న సూపర్ హీరో’ దసరాకి రిలీజ్ 

నవ దళపతి సుధీర్ బాబు యూనిక్ ఎమోషనల్ సాగా ‘మా నాన్న సూపర్‌హీరో’తో అలరించడానికి సిద్ధమౌతున్నారు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

మేకర్స్ మూవీ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. దసరా పండుగ సందర్భంగా మా నాన్న సూపర్‌హీరో విడుదల కానుంది. సినిమాల విడుదలకు బెస్ట్ సీజన్లలో దసరా ఒకటి. ఫ్యామిలీస్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే కంటెంట్ వున్న ‘మా నాన్న సూపర్ హీరో’ రిలీజ్ కి దసరా పర్ఫెక్ట్ టైమ్. ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ని త్వరలోనే రివిల్ చేయనున్నారు. 

‘మా నాన్న సూపర్‌హీరో’ మూవీ ప్రేమ, అనుబంధంకు నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్ ని కదిలించే జర్నీని ప్రారంభించిన ఫాదర్ అండ్ సన్ డ్రామా. టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

 సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

ఈ సినిమాకి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్.

MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి కో రైటర్స్. రాజు సుందరం మాస్టర్‌ కొరియోగ్రాఫీతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు. 

మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ని ప్రారంభించనున్నారు.

తారాగణం: సుధీర్ బాబు, ఆర్ణ, సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: వి సెల్యులాయిడ్స్

అషోషియేషన్ విత్: CAM ఎంటర్‌టైన్‌మెంట్

దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర

నిర్మాత: సునీల్ బలుసు

డీవోపీ: సమీర్ కళ్యాణి

సంగీతం: జై క్రిష్

ఎడిటర్: అనిల్ కుమార్ పి

క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజాల

ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ గోజాలా

కాస్ట్యూమ్ డిజైనర్: రజిని

కొరియోగ్రఫీ: రాజు సుందరం

రైటర్స్: MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర

పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…

27 minutes ago

శ్రీరామ్‌ ‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్‌. ఈయన…

21 hours ago

సబ్ స్క్రైబర్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న ఆహా ఓటీటీ

తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…

21 hours ago

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం నుంచి ‘పయనమే’ అంటూ సాగే మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…

22 hours ago

ఎన్‌టీఆర్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

ప్రముఖ‌ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్‌.టి.ఆర్‌) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ క‌ల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…

1 day ago

‘శబార’ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది.. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ఈవెంట్‌లో హీరో దీక్షిత్ శెట్టి

దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…

1 day ago