సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం పర్యావరణ పరిరక్షణ పోరాడటం అనేది అందరి బాధ్యత.ఆ బాధ్యతను స్వచ్చందంగా చేపట్టి పోరాడుతున్నారు కొందరు సినీప్రముఖులు. కొత్వాల్ గూడ లో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్ పర్యావరణానికి పెద్ద ముప్పు కాబోతుందని సినీ నటులు రేణూదేశాయ్, శ్రీదివ్య , దర్శకుడు శశికిరణ్ తిక్కా తో పాటు మరికొందరు ప్రముఖులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు.
ఏటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా చేపట్టిన ఈ అక్వా మెరైన్ పార్క్ నిర్మాణం ఆపివేయాలంటూ కోర్ట్ ను ఆశ్రయించారు. ఇటువంటి పార్క్ ల నిర్మాణం సింగపూర్ , మలేసియా వంటి దేశాలలో జరిగాయి మన దేశంలో ఎందుకు సాధ్యం కాదని కోర్ట్ ప్రశ్నించింది. అయితే వీటికి సమాధానం గా పిటీషనర్ తరపున న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ ఎటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా ఏర్పాటుచేసే ఈ పార్క్ లతో జలచరాలకు, వన్య ప్రాణులకు నష్టం వాటిల్లుతుందనే వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి, హెచ్ ఎమ్ డీ ఏ లకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ఉజ్జల్ భుయాన్ , జస్టిస్ తుకారంజీలు ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుంది.
ఈ సందర్భంగా పిటీషనర్స్ లో ఒకరైన దర్శకుడు శశికిరణ్ తిక్కా మాట్లాడుతూః
పర్యావరణానికి చేటు చేసే విధంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ పై మేము చేస్తున్న ఈ పోరాటం కు మీ మద్దతు కూడా కావాలి. వేలాది జలచరాల మనుగడ కు ముప్పు వాటిల్లే ఆక్వా మైరైన్ పార్క్ లు పర్యావరణాన్ని దెబ్బ తీస్తాయి. వాటిని ఆహ్లాదం కోసం మనముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా చనిపోతాయి. తరువాత కత్రిమంగా ఏర్పాటు చేసిన లైట్స్ లో వాటి జీవనం అత్యంత బాధాకరంగా మారుతుంది. వేల గ్యాలన్ల నీటితో నడిచే ఈ ఆక్వా పార్క్ లు నీటి సమస్యకు కారణం అవుతాయి. ఇలాంటి పార్క్ ల నిర్మాణం చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అన్నారు.
నటి సద మాట్లాడతూః
ఇప్పటికే నగరంలో నీటి సమస్య చాలా పెరుగుతుంది. మూడు వేల గ్యాలన్ల నీటితో నిర్మాణం అయ్యేఇలాంటి ఆక్వా పార్క్ లు నీటి సమస్య కు కారణం అవుతాయి. సహాజంగా సముద్రాలలో పెరిగేజలచరాలును పట్టి కత్రిమంగా నిర్మాణం అయ్యే ఇలాంటి పార్క్ లలో ఉంచడం వాటి ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. వాటిని పట్టి తెచ్చే ప్రక్రియలోనే చాలా జలచరాలు ప్రాణాలు కోల్పోతాయి.ఇలాంటి పార్క్ లు కాకుడా ఎన్విరాన్ మెంట్ పై అవగాహాన పెంచే పార్క్ లను ఎచ్ ఎమ్ డి ఎ వారు ఏర్పాటు చేస్తే మంచిది. అన్నారు.
Actor Yogesh kalle is making his acting debut with the Pan Indian Film "Trimukha" in…
నటుడు యోగేష్ పాన్ ఇండియన్ ఫిల్మ్ "త్రిముఖ"తో తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నాడు, ఇందులో నాజర్, సిఐడి ఆదిత్య…
ZEE5 లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘వికటకవి’ ట్రైలర్ విడుదల చేసిన యంగ్ హీరో విశ్వక్ సేన్.. నరేష్ అగస్త్య, మేఘా…
~ Telangana's first detective series, ‘Vikkatakavi’ premieres on November 28 on ZEE5 ~ ~ Produced…
The movie Dhoom Dhaam stars Chetan Krishna and Hebah Patel in the lead roles. Sai…
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్,…