హాలీవుడ్ విజనరీ జేమ్స్ కామెరన్ ప్రేక్షకులను మళ్లీ పాండోరా లోకానికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, మైలీ సైరస్ తన అత్యంత ఆసక్తికరమైన ఒరిజినల్ పాట ‘డ్రీమ్ ఏజ్ వన్’ను అధికారికంగా విడుదల చేసింది. ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ చిత్రం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సాంగ్‌ను ఆమె సోషల్ మీడియా ద్వారా విడుదల చేయగా, అభిమానుల నుండి ఇప్పటికే ఈ పాటకు అద్భుతమైన స్పందన లభించింది.
పాటపై తన భావాలను పంచుకున్న మైలీ, ఇది సాధారణ కంపోజిషన్ కాదని, తన హృదయం నుంచి వచ్చిన భావోద్వేగాల సమాహారమని పేర్కొంది.
“మార్క్ రాన్‌సన్, ఆండ్రూ వైట్‌లతో కలిసి ఈ పాట రాయడం నాకు చాలా వ్యక్తిగతం. మన గతం, మన ప్రస్తుత పరిస్థితి, మన భవిష్యత్తుపై ఉన్న ఆశ—ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులతో ఇంతటి అనుబంధం ఉన్న సినిమాకు ఇంత ప్రాముఖ్యమైన గీతాన్ని అందించడం గర్వకారణం,” అని ఆమె వివరించింది.
డిసెంబర్ 19న భారీ విడుదల కానున్న ‘ఫైర్ అండ్ ఆష్’లో జేక్ సల్లి (సామ్ వర్తింగ్టన్), నేయ్టిరీ (జోయి సాల్డానా), సల్లి ఫ్యామిలీ కథను మరింత లోతుగా చూపించేందుకు జేమ్స్ కామెరన్ భారీ స్థాయిలో ఆ ప్రపంచాన్ని మళ్లీ నిర్మించారు. ఈ కథ, స్క్రీన్‌ప్లేలో కామెరన్‌తో పాటు రిక్ జాఫ్ఫా, అమాండా సిల్వర్, జోష్ ఫ్రైడ్మన్, షేన్ సాలెర్నో వంటి ప్రముఖ రచయితలు పాలుపంచుకున్నారు.
ఈ చిత్రంలో సిగోనీ వీవర్, స్టీఫెన్ లాంగ్, ఒనా చాప్లిన్, క్లిఫ్ కర్టిస్, బ్రిటన్ డాల్టన్, ట్రినిటీ బ్లిస్, జాక్ చాంపియన్, బేయిలీ బాస్, కేట్ విన్స్‌లెట్ వంటి కీలక నటులు నటిస్తున్నారు.
‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ డిసెంబర్ 19 నుంచి ఆరు భారతీయ భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్) భాషల్లో ఘనంగా విడుదల కానుంది
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…