మేఘాంశ్ శ్రీహరి‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా? ప్రారంభం

మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్‌దేవ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు జి. భవానీ శంకర్ దర్శకత్వంలో A2 పిక్చర్స్ బ్యానర్ పై సంధ్యా రాణి, స్వరూప రాణి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా ?’

ఈ రోజు ఈ చిత్రంప్రారంభోత్సవ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. హీరో మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, చోటా కె నాయుడు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బాబీ కొల్లి గౌరవ దర్శకత్వం వహించారు. మంచు మనోజ్, బాబీ కొల్లి , చోటా కె నాయుడు టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర యూనిట్ కు శుభాశిస్సులు అందించారు.

ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సి . రామ్ ప్రసాద్ కెమరామెన్ గా పని చేస్తుండగా.. స్టార్ కంపోజర్ గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎంఆర్ వర్మ ఎడిటర్ కాగ, రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్.

పోసాని కృష్ణ మురళి, సునీల్, హర్ష వర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు సుదర్శన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మూవీ లాంచింగ్ ఈవెంట్ లో హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. ప్రారంభోత్సవ వేడుకకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన మంత్రి తలసాని గారికి, మనోజ్ అన్నకి, బాబీ అన్నకి, చోటా గారికి కృతజ్ఞతలు. దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేశాను. మా నిర్మాత చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. గోపిసుందర్, రామ్ ప్రసాద్ గారు లాంటి బెస్ట్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేయడం ఆనందంగా వుంది. మమ్మల్ని నమ్మి ఇంత భారీగా సినిమాని నిర్మిస్తున్న నిర్మాతకు మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు.

దర్శకుడు భవానీ శంకర్ మాట్లాడుతూ.. ఈ కథని ఎక్కడా రాజీపడకుండా గొప్పగా నిర్మిస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. గోపిసుందర్, రామ్ ప్రసాద్,ఎంఆర్ వర్మ లాంటి మంచి టెక్నిషియన్స్ ఇచ్చారు. వారి నమ్మకం వలనే ఇది సాధ్యపడింది. ఎ 2 పిక్చర్స్ కి ఎప్పుడూ రుణపడి వుంటాను. గోపి సుందర్ గారు ఇచ్చిన పాటలన్నీ బ్లాక్ బస్టర్ అవుతాయ్. ఇందులో బ్రహ్మ పాత్ర సౌత్ ఇండస్ట్రీ లో ఒక టాప్ హీరో చేయబోతున్నారు. అది త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ఇది సోషియో ఫాంటసీ, మైథాలజీ, లవ్, ఫుల్ ఎంటర్ టైనర్. మీ అందరి ప్రోత్సాహం కావాలి’ అని కోరారు.

గోపి సుందర్ మాట్లాడుతూ.. దర్శకుడు భవానీ చెప్పిన కథ చాలా నచ్చింది. ఇందులో ఆరు పాటలు వుంటాయి. ఇది ఫుల్ ప్యాకేజ్. సబ్జెక్ట్ చాలా కొత్తగా వుంటుంది. అందరూ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు.

రియా సచ్‌దేవ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ లో చేయడం చాలా ఎక్సయిటింగా వుంది. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. ఎ 2 పిక్చర్స్ ద్వారా మేము నిర్మిస్తున్న మొదటి చిత్రం ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?’. దర్శకుడు భవానీ శంకర్ చెప్పిన కథ చాలా బావుంది. కథపై నమ్మకంతో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి గోపీసుందర్, రామ్ ప్రసాద్ లాంటి పెద్ద టెక్నిషియన్స్ వుండటం మా అదృష్టం. మా మొదటి ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలి’’ అని కోరారు.

తారాగణం: మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్‌దేవ, పోసాని కృష్ణ మురళి, సునీల్, హర్ష వర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు సుదర్శన్ తదితరులు

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం – జి. భవానీ శంకర్

బ్యానర్ – A2 పిక్చర్స్

నిర్మాతలు – సంధ్యా రాణి, స్వరూప రాణి

డీవోపీ – సి. రామ్ ప్రసాద్

సంగీతం – గోపి సుందర్

ఎడిటర్ – ఎంఆర్ వర్మ

ఆర్ట్ – రఘు కులకర్ణి

లిరిక్స్ – శ్యామ్ కాసర్ల& శ్రీమణి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ముత్తినీడు గణేష్

Tfja Team

Recent Posts

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

21 hours ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

3 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

3 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

3 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

3 days ago