అల్లు అర్జున్‌ ‘పుష్ప-2 ది రూల్‌’ లో మాసివ్‌ ”కిస్సిక్‌” సాంగ్‌ కోసం శ్రీలీల

డ్యాన్సుల్లో తనదైన స్టయిల్‌, తనకంటూ ఓ పత్యేక మార్క్‌ క్రియేట్‌ చేసుకుని, నటనలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటనతో పాటు డ్యాన్సింగ్‌లో కూడా వన్‌ ఆఫ్‌ ద ఫైనెస్ట్‌ ఇండియన్‌ డ్యాన్సర్‌గా ఉన్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌తో.. డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల జతకడుతోంది.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇండియన్‌ ఫిల్మ్‌ పుష్ప-2 ది రూల్‌ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, కథానాయిక శ్రీలీలపై ఓ స్పెషల్‌ మాసివ్‌ కిస్సిక్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్‌ అధికారికంగా విడుదల చేశారు. ఐకాన్‌ స్టార్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకుడు.సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఈ ప్రెస్టేజియస్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచానాలు తారాస్థాయిలో వున్నాయి. సినిమాలో కంటెంట్‌ కూడా అంతకు మించి అస్సలు తగ్గేదేలా అనే విధంగా వుండబోతుంది. ఇక పుష్ప ది రైజ్‌ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-సమంతలపై చిత్రీకరించిన ఊ అంటావా మామా ఊఊ అంటావా సాంగ్‌ జాతీయ స్థాయిలో ఎంత పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా పుష్ప-2 దిరూల్‌లో చిత్రీకరిస్తున్న ఈ మాసివ్‌ నెంబర్‌ దానికి మించి ఉండబోతుంది. ఈ మాసివ్‌ కిస్సిక్‌ సాంగ్‌లో ఐకాన్‌ స్టార్‌ సూపర్భ్‌ డ్యాన్స్, ఆయన స్వాగ్‌ ఆయన అభిమానులను, ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్స్‌ను పాట్నా, కలకత్తా, చెన్నయ్‌, కొచ్చి, బెంగళూరు, ముంబయ్‌ హైదరాబాద్‌లో ఈ మాసివ్‌గా నిర్వహించబోతున్నారు.ప్రస్తుతం ఒకవైపు చివరి దశలో వున్న చిత్రీకరణతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులను ఈ చిత్రం జరుపుకుంటోంది. ఇక బాక్సీఫీస్‌ రికార్డులను రూపుమాపడానికి, ఇండియాను కలెక్షన్ల తుఫాన్‌ షేక్‌ చేయడానికి ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌- బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల వండర్‌ఫుల్‌ ఫిల్మ్‌ పుష్ప-2 ది రూల్‌ సర్వాంగ సుందరగా ముస్తాబు అవుతుంది.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago