‘ఉత్సవం’ నుంచి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సాంగ్ రిలీజ్

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఈ రోజు ‘ఉత్సవం’ నుంచి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సాంగ్ ని రిలీజ్ చేశారు. స్టార్ కంపోజర్ అనూప్ రూబెన్స్ ఈ పాటని బ్యూటీఫుల్ సిగ్నేచర్ మెలోడీగా కంపోజ్ చేశారు. ట్యూన్ విన్నవెంటనే కనెక్ట్ అయ్యేలా వుంది. సాంగ్ టైటిల్ కి తగ్గటే మ్యారేజ్ వైబ్ తో ఆర్కెస్ట్రా రైజేషన్ అద్భుతంగా వుంది. 

అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ ఈ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. అర్మాన్ మాలిక్ తన వోకల్స్ తో మెస్మరైజ్ చేశాడు. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. 

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.

సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 

తారాగణం: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: అర్జున్ సాయి

నిర్మాత: సురేష్ పాటిల్

సమర్పణ: హార్న్‌బిల్ పిక్చర్స్

సంగీతం: అనూప్ రూబెన్స్

సాహిత్యం: వనమాలి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్.

గాయకులు: అనురాగ్ కులకర్ణి, కైలాష్ ఖేర్, అర్మాన్ మాలిక్, విజయ్ ప్రకాష్, పెంచల్ దాస్/ రామ్ మిరియాల.

ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

డీవోపీ: రసూల్ ఎల్లోర్

డైలాగ్స్:రమణ గోపిసెట్టి

డిఐ & సౌండ్ మిక్స్: అన్నపూర్ణ స్టూడియోస్

మ్యూజిక్ లేబుల్: లహరి మ్యూజిక్ 

పీఆర్వో: వంశీ- శేఖర్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

2 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

2 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

2 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

2 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

2 days ago