వేసవిలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ‘మండాడి’ చిత్రయూనిట్ సన్నాహాలు.. హైలెట్‌గా నిలవనున్న సెయిల్ బోట్ రేసింగ్ సీక్వెన్సెస్

RS ఇన్ఫోటైన్‌మెంట్ నుండి 16వ ప్రాజెక్ట్‌గా ‘మండాడి’ చిత్రం రాబోతోంది. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో ఇంటెన్స్ స్పోర్ట్స్-యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఇంటెన్స్ రా అండ్ రస్టిక్, రూటెడ్ కథతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన విజువల్స్, అద్భుతమైన నటన, ఎమోషన్స్‌తో ఈ మూవీ రాబోతోంది. ముఖ్యంగా సుహాస్ మొదటిసారి పూర్తి స్థాయి విలన్‌గా నటించడంతో ఈ మూవీ మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పటికే చిత్రయూనిట్ 70% షూటింగ్ పూర్తి చేసిందని సమాచారం.

2026 వేసవిలో ఈ మూవీని విడుదల చేయాలని ‘మండాడి’ టీం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ చేసినట్టుగా సమాచారం. ఇది సూరి కెరీర్‌లో అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలుస్తుంది. ఇంత వరకు సూరి పోషించిన అన్ని పాత్రల్లోకెల్లా ఈ ‘మండాడి’ మూవీ, అందులోని కారెక్టర్ మరింత స్పెషల్‌గా ఉండబోతోంది.

సూరి, సుహాస్ యాక్షన్ సీక్వెన్స్, హై-ఇంటెన్సిటీతో సముద్రంలో ఉండే యాక్షన్ సన్నివేశాలు, సెయిల్ బోట్ రేస్ ఎపిసోడ్ల కోసం వారిద్దరూ పడిన కష్టం, ఆరు నెలల పాటు పొందిన కఠిన శిక్ష ఇవన్నీ సినిమాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తమిళం, తెలుగు, హిందీ భాషలలో విడుదలవుతున్న ఈ చిత్రం పాన్-ఇండియన్ రీచ్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడనిదాన్ని అడ్రినలిన్‌ రష్ కలిగించేలా సెయిల్ బోట్ రేసింగ్ సీన్లను షూట్ చేసినట్టుగా సమాచారం.

వరల్డ్ క్లాస్ క్వాలిటీని ఇచ్చేందుకు అంతర్జాతీయ యాక్షన్ నిపుణులను టీంలోకి తీసుకున్నారు. టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ దాదాపు 60 రోజులు ఈ చిత్రం కోసం పనిచేశారు. తీవ్రమైన, వాస్తవిక, భావోద్వేగాలతో నడిచే స్టంట్ డిజైన్‌ను అందించారు. 75 కోట్ల అంచనా బడ్జెట్‌తో నిర్మించబడిన ‘మండాడి’ అంతర్జాతీయ ప్రమాణాలతో మెప్పించబోతోంది. మిగిలిన షూటింగ్ పూర్తయిన తర్వాత విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించనుంది.

TFJA

Recent Posts

అంగరంగ వైభవంగా ‘భావ రస నాట్యోత్సవం – సీజన్ 1’

'మదాలస - స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్' ఆధ్వర్యంలో 'భావ రస నాట్యోత్సవం - సీజన్ 1' అంగరంగ వైభవంగా…

9 hours ago

యానిమల్, స్పిరిట్ ఫేం హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ లో ‘త్రికాల’ సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన అదిరిపోయే పాట యాలో ఈ గుబులే ఎలో రిలీజ్

అర్జున్ రెడ్డి, యానిమల్ పాన్ ఇండియా హిట్స్ తో పాటు నేషనల్ అవార్డ్ అందుకున్న హర్షవర్దన్ రామేశ్వర్ … ఇప్పుడు…

1 day ago

‘జెట్లీ’ తో మార్నింగ్ షోనే ఫుల్ మీల్స్ పెడతాం: గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ రితేష్ రానా

మైత్రీ మూవీ మేకర్స్ ప్రజెంట్స్, సత్య, రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ 'జెట్లీ' హ్యుమర్ ఫిల్డ్ యాక్షన్ గ్లింప్స్ రిలీజ్…

1 day ago

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి స్పెషల్ బర్త్ డే యాక్షన్ ప్యాక్డ్ పోస్టర్ రిలీజ్

యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌  ‘టైసన్…

1 day ago

యంగ్ స్టార్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు బర్త్ డే విశెస్ తెలిపిన “రామమ్” మూవీ టీమ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "రామమ్". ఈ రోజు ఈ యంగ్ స్టార్ హీరో పుట్టినరోజు…

2 days ago

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై”

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…

2 days ago