24 గంటల్లో రికార్డ్ వ్యూస్ సాధించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్..

24 గంటల్లో రికార్డ్ వ్యూస్ సాధించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్.. జనవరి 7న జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేయనున్న మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ మెషీన్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం నాడు రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్ సాధించింది. 24 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ ఇప్పటికీ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. చిరంజీవి గత చిత్రాల నుంచి వచ్చిన ట్రైలర్‌లలో ఓ రేంజ్ రికార్డ్ వ్యూస్‌ను సాధించి టాప్‌లో దూసుకుపోతోంది ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్.

ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ తరుణం వచ్చేసింది. జనవరి 7న హైదరాబాద్‌లో జరగనున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సందడి చేయనున్నారు. మొదటి నుంచీ డిఫరెంట్ ప్రమోషన్స్‌తో టీం ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమోషన్స్‌లో మొదటి సారిగా చిరంజీవి, వెంకటేష్ కనిపించబోతోన్నారు. ఇది ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ లెజెండరీ స్టార్స్ చేసే సందడి, వారిద్దరి బంధాన్ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్రైలర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. కావాల్సినంత వినోదం, హాస్యం, మాస్ అప్పీల్‌తో నిండిన ఈ సినిమాలో చిరంజీవి, వెంకటేష్ కాంబో సీన్స్ హైలెట్ కానున్నాయని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. వీరి కాంబో గురించి ఇప్పటికే అందరూ మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago