ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి ‘ఫియర్ సాంగ్’విడుదల

మాన్‌ ఆఫ్‌ మాసెస్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.  ప్రపంచస్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండ‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్ కీల‌క పాత్ర‌లో మెప్పించ‌నున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. ఫస్ట్ పార్టు షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మే 20న ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘దేవర’ చిత్రం నుంచి తొలి పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ‘ఫియ‌ర్ సాంగ్‌’ అంటూ రిలీజైన ఈ పాట‌ను స‌ర‌స్వ‌తీపుత్ర రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాశారు. పాట‌లో లైన్స్ ఎన్టీఆర్ పోషించిన ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లోని గ‌ర్జ‌న‌ను తెలియ‌జేస్తున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హించ‌ట‌మే కాకుండా పాట‌ను అద్భుతంగా పాడారు. దేవ‌ర‌-లార్డ్ ఆఫ్ ఫియ‌ర్‌గా పాట నెక్ట్స్ లెవ‌ల్ ఎలివేష‌న్ ఇస్తోంది. అలాగే పాట‌లోని ఎన్టీఆర్ గ్లింప్స్ అభిమానుల‌కు, సినీ ప్రేక్ష‌కుల‌కు మంచి కిక్‌ను ఇస్తున్నాయి.

తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో భాష‌ల్లోనూ ఈ పాట విడుద‌లవ‌గా అన్నీ లాంగ్వేజెస్‌లో పాట విన‌టానికి అద్భుతంగా ఉంది. అనిరుద్ ర‌విచంద‌ర్ తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో పాట‌ను పాడారు. క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సంతోష్ వెంకీ  పాట‌ను ఆల‌పించారు. తార‌క్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌లైన దేవ‌ర ఫియ‌ర్ సాంగ్ మంచి ట్రీట్‌లా అంద‌రినీ అల‌రిస్తోంది. పాట‌లోని నిర్మాణ విలువ‌లు, గ్రిప్పింగ్ విజువ‌ల్స్‌, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజ‌న్స్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి.

‘దేవర’గా టైటిల్ పాత్ర‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై  మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్‌, ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, సాబు శిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago