సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌, భారీ బ‌డ్జెట్ మూవీ ‘వేట్టైయాన్’ అక్టోబ‌ర్ 10న విడుద‌ల‌

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బ‌డ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్’. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు. సామాజిక ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను తెలియ‌జేసేలా సినిమాలు చేస్తూ విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లను అందుకున్న ద‌ర్శ‌కుడు టి.జె.జ్ఞాన‌వేల్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియ మూవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోంది.

బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు 2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్ష్ క‌ల‌యిక‌లో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్’. అలాగే పేట‌, ద‌ర్బార్‌, జైల‌ర్ చిత్రాల త‌ర్వాత‌ ర‌జినీకాంత్, రాక్ స్టార్ అనిరుద్ ర‌విచంద‌ర్ క‌ల‌యిక‌లోనూ రానున్న నాలుగో సినిమా కూడా ఇదే కావ‌టం విశేషం.

‘వేట్టైయాన్’ చిత్రంలో భారీతారాణం కూడా న‌టిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆస‌క్తిక‌రమైన విష‌య‌మేమంటే అంధాకానూన్‌, గిర‌ఫ్తార్‌, హ‌మ్ సినిమాల త‌ర్వాత రజినీకాంత్‌, అమితాబ్ క‌లిసి న‌టిస్తోన్న నాలుగో సినిమా ఇది. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్ జికెఎం. త‌మిళ్ కుమ‌ర‌న్ ఆధ్వ‌ర్యంలో వేట్టైయాన్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఆడియెన్స్‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది.

న‌టీన‌టులు:

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషరా విజ‌య‌న్ త‌దిత‌రులు

న‌టీన‌టులు:
బ్యాన‌ర్‌:  లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, సుభాస్క‌ర‌న్‌, టి.జె.జ్ఞాన‌వేల్‌, మ్యూజిక్‌: అనిరుద్ ర‌విచంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ఎస్‌.ఆర్‌.క‌దిర్‌, ఎడిట‌ర్‌:  ఫిలోమిన్ రాజ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  కె.క‌దిర్‌, యాక్ష‌న్‌:  అన్బ‌రివు, కొరియోగ్ర‌ఫీ:  దినేష్‌, పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర కుమార్‌- ఫ‌ణి కందుకూరి(బియాండ్ మీడియా).

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

3 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago