కింగ్ మేకర్ పిక్చర్స్ పతాకంపై శ్రీకాంత్ రెడ్డి ఆసం హీరో గా నటిస్తూ కథ, స్టాంట్స్, సంగీతం, దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “లారి చాప్టర్ -1”. చెన్నై లొయోల కాలేజీ లో డైరెక్షన్ కోర్స్ చేసి హైదరాబాద్ వచ్చి పలు చిత్రాల్లో వివిధ శాఖలలో పని చేసి ప్రావీణ్యం పొందాడు. తర్వాత యూట్యూబ్ లో తన వీడియోలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని మంచి పాపులారిటీ సంపాదించి ఇప్పుడు “లారి చాప్టర్ -1” అనే చలన చిత్రం తో వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం లో హీరోయిన్ గా చంధ్ర శిఖ నటించగా రాఖీ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.
అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ఆసం మాట్లాడుతూ “చెన్నై లొయోల కాలేజీ లో డైరెక్షన్ కోర్స్ చేసిన మొదట యూట్యూబ్ లో నా కెరీర్ ప్రారంభించాను. యూట్యూబ్ లో మంచి వీడియోలు చేశాను, చాలా వ్యూస్ వచ్చాయి, మంచి పాపులారిటీ వచ్చింది. అలాగే చాలా సినిమాలకు వివిధ శాఖలలో పని చేశాను. ఇప్పుడు “లారి చాప్టర్ -1” అనే సినిమా తో మీ ముందుకు వస్తున్నాను. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు తో పాటు తమిళం, కన్నడ, హిందీ మరియు బెంగాలీ భాషలో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాను.
ఈరోజు నా చిత్రం లోని మొదటి పోస్టర్ ను విడుదల చేస్తున్నాను. సినిమా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. త్వరలో విడుదల చేస్తాను. నా మొదటి సినిమా అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.
చిత్రం పేరు : లారి చాప్టర్ -1 (Lorry Chapter-1)
నటి నటులు : శ్రీకాంత్ రెడ్డి ఆసం, చంధ్ర శిఖ, రాఖి సింగ్, తదితరులు
బ్యానర్ : కింగ్ మేకర్ పిక్చర్స్ (King Maker Pictures)
కెమెరా మాన్ : తాడిపత్రి నాగార్జున
పి ఆర్ ఓ : పాల్ పవన్
నిర్మాత : ఆసం వెంకట లక్ష్మి
కథ, స్టాంట్స్, ఎడిటర్, సంగీతం, దర్శకత్వం : శ్రీకాంత్ రెడ్డి అసం
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…