నచ్చినవాడు చిత్రం ట్రైలర్ విడుదల

స్ట్రీట్ డాగ్ సమర్పణలో ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా మరియు కావ్య రమేష్ హీరో హీరోయిన్ గా వెంకటరత్నం తో కలిసి లక్ష్మణ్ చిన్నా స్వయ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “నచ్చినవాడు”. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మిజో జోసెఫ్. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో

హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ “నచ్చినవాడు” స్త్రీ సెల్ఫ్ రెస్పెక్ట్ కథాంశంగా చేసుకుని అల్లిన ప్రేమ కథా చిత్రం, విజువల్ గా మరియు క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. కథకి అనుగుణంగా అందరిని కొత్తవాళ్లను తీసుకున్నాను, అందరు బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ మెజ్జో జోసెఫ్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ప్రేక్షకులు ఈ చిత్రం చూసాక మంచి ఫీల్ తో ఇంటికి వెళ్తాడు , సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఆగస్టు 18న విడుదల కు సిద్ధంగా ఉన్నాము” అని తెలిపారు.

హీరోయిన్ కావ్య రమేష్ మాట్లాడుతూ “నచ్చినవాడు చిత్రం లో నేను అను అనే క్యారెక్టర్ చేశాను. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం, చాలా నీతిగా ఉంటుంది. తనకి ఎంత కష్టం వచ్చిన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోదు. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు. మా సినిమా ఆగస్టు 18న విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.

నటి లలిత నాయక్ మాట్లాడుతూ “నేను కన్నడ అమ్మాయిని, ఇది నా మొదటి సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు” అని తెలిపారు.

నటుడు ఏ.బి. అర్.పి. రెడ్డి మాట్లాడుతూ “నచ్చినవాడు అద్భుతమైన సినిమా. ఆడవాళ్లు గురించి, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చాలా అందంగా చిత్రీకరించారు. ఇంత మంచి సినిమా తో వస్తున్నా లక్ష్మణ్ చిన్నా కి నా అభినందనలు” అని తెలియజేసారు.

దర్శన్ మాట్లాడుతూ “నచ్చినవాడు చిత్రం లో నేను చాలా ముఖ్యమైన పాత్ర చేశాను. సినిమా చాలా బాగుంది, ఆగస్టు 18న విడుదల అవుతుంది. అందరు చూడండి” అని తెలిపారు.

కెమెరా మాన్ అనిరుద్ మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, మంచి కంటెంట్ ఉన్న చిత్రం, అందరికీ నచ్చుతుంది. మిజో జోసెఫ్ మంచి సంగీతం ఇచ్చారు” అని తెలిపారు.

ఈ చిత్రానికి సాహిత్యం అందించిన హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ “నేను చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ కి లిరిక్స్ రాసాను కానీ సినిమా పాటలకి పని చేయడం ఇదే మొదలు. లక్ష్మణ్ చిన్నా గారు నాకు ఒక పాట ఇచ్చారు, ఉదయం ట్యూన్ వస్తే మధ్యాహ్నం కాళ్ళ లిరిక్స్ రాసి పంపించాను, తర్వాత అని పాటలు నన్నే రాయమని చెప్పారు. పాటలు చాలా బాగా వచ్చాయి, మిజో జోసెఫ్ సంగీతం చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధిస్తుంది” అని కోరుకున్నారు.

చిత్రం పేరు : నచ్చినవాడు

నటి నటులు : లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్, కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్, ప్రేరణ బట్, ఏ.బి. అర్.పి. రెడ్డి, ప్రవీణ్ మరియు తదితరులు

పబ్లిసిటీ డిజైన్ : అనిల్, సాయి

సౌండ్ ఎఫెక్ట్స్ : ఎతిరాజ్

కలారిస్ట్ : R. గోపాల కృష్ణన్

ఆర్ట్ డైరెక్టర్ : నగేష్, గగన్

DOP : అనిరుద్

ఎడిటర్ : K.A.Y. పాపా రావు

అసోసియేట్ డైరెక్టర్స్ : మనోజ్ కుమార్, విశ్వనాధ్, ఫణికుమార్

కొరియోగ్రఫీ : ఆర్య రాజ్ వీర్

సాహిత్యం – హర్షవర్ధన్ రెడ్డి

సంగీతం – మెజ్జో జోసెఫ్

కథ, కథనం, దర్శకత్వం : లక్ష్మణ్ చిన్నా

నిర్మాతలు : లక్ష్మణ్ చిన్నా,వెంకట రత్నం

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago