గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా మలయాళంలో ఓ హ్యూజ్ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో “మంజుమ్మెల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా
నిర్మాత వెంకట్ కె నారాయణ మాట్లాడుతూ – భాషలకు అతీతంగా ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వాలనేది మా సంస్థ లక్ష్యం. ఈ క్రమంలోనే మలయాళ చిత్ర పరిశ్రమలోకి భారీ చిత్రాన్ని తీసుకురాబోతున్నాం. మా సంస్థ నుంచి ప్రేక్షకులు ఆశించే హై క్వాలిటీ మూవీని టాలెంటెడ్ టీమ్ తో కలిసి నిర్మించనున్నాం. అన్నారు.
డైరెక్టర్ చిదంబరం మాట్లాడుతూ – ఇలాంటి గొప్ప మూవీ కోసం నేను ఎదురుచూస్తున్నాను. ప్యాషనేట్ టీమ్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా విజన్ ను త్వరలోనే ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నాం. అన్నారు.
స్క్రిప్ట్ అందించిన జితూ మాధవన్ మాట్లాడుతూ – నా మనసుకు దగ్గరైన కథ ఇది. ఇలాంటి బ్యూటిఫుల్ టీమ్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు ఒక మంచి మూవీని అందిస్తామని చెప్పగలను. అన్నారు.
త్వరలోనే ఈ చిత్రానికి సంధించిన కాస్టింగ్, రెగ్యులర్ షూటింగ్ వివరాలు మూవీ మేకర్స్ వెల్లడించనున్నారు.
ఎడిటర్ – వివేక్ హర్షన్
డీపీవో – షైజు ఖాలిద్
మ్యూజిక్ – సుషిన్ శ్యామ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన – జితూ మాధవన్
నిర్మాతలు – వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్
దర్శకత్వం – చిదంబరం
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…