ఎఫ్ టీ పీ సి ఇండియా – తెలుగు సినిమా వేదిక సంయుక్త నిర్వహణ
కృష్ణంరాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎఫ్ టీ పీ సి ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు సినిమా, విద్య వైద్య సామాజిక రంగాలకు చెందిన పలువురిని రెబెల్ స్టార్ కృష్ణం రాజు ప్రతిభాపురస్కారం తో సత్కరించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా , విజయ్ వర్మ పాకలపాటి లు మాట్లాడుతూ విద్య వైద్య సామాజిక రంగాలను ప్రోత్సహించిన కృష్ణం రాజు గారి ఆశయాలు రాబోయే తరాలు గుర్తించుకొనేలా ఈ అవార్డు ల కార్యక్రమాన్ని ప్రతిఏటా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామని ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమం లో దుబాయ్ కి చెందిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు జితేంద్ర మైథలానే ని ప్రత్యేకంగా సత్కరించామని తెలిపారు. ప్రభుత్వ విప్ రామచంద్రులు నాయక్, ఘజల్ శ్రీనివాస్ , మాజీ ఎం ఎల్ సి ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు , దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ , నటుడు గౌతమ్ రాజు, కృష్ణుడు, హెచ్ ఆర్ ఓ వరల్డ్ చైర్మన్ నేమ్సింగ్ ప్రేమి , తదితరులు విచ్చేసి పలురంగాల వారికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు.బాలీవుడ్ నటీమణులు ధని బోస్,మోక్ష , అనీషా ముఖర్జీ , నేహా షా లకు ప్రత్యేక పురస్కారాన్ని అందజేశారు.
భీమవరం లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న కారణంగా హైదరాబాద్ లో జరిగే ఈ ప్రతిభ పురస్కారాల కార్యక్రమానికి రాలేకపోతున్నానని, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విజయ్ వర్మ , చైతన్యలకు తమ కుటుంభం తరుపున అభినందనలు తెలుపుతున్నట్లు స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి వీడియో విడుదల చేయడమే కాక కార్యక్రమం జరిగే సమయంలో ఫోన్ చేసి నిర్వాహకులను , అతిధులను , అవార్డు గ్రహీతలను అభినందించారు.
ఎఫ్ టీ పీ సి ఇండియా కు అమెరికన్ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేషన్ రావడంపట్ల సంస్థ అధ్యక్ష కార్యదర్సులు హర్షం వ్యక్తం చేశారు.ఇండియా లోనే ఈ సర్టిఫికేషన్ వచ్చిన ఏకైక సంస్థ ఎఫ్ టీ పీ సి ఇండియా కావడం విశేషం .
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లోని సురవరం ప్రతాపరెడ్డి హాల్ లో ఈకార్యక్రమం జరిగింది .
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…