రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’. ఈ సినిమాలో అర్చన శాస్త్రి, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
కర్మస్థలం అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో కనిపించిన పాత్రలు, ఆ పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఇక అర్చనా లుక్, గెటప్ ఈ పోస్టర్‌లో హైలెట్ అవుతోంది. బ్యాక్ గ్రౌండ్‌లో అమ్మవారి షాడో కనిపించడం చూస్తుంటే.. ఈ చిత్రానికి ఏ రేంజ్‌లో వీఎఫ్ఎక్స్‌ను వాడారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన అనంతరం..
హీరోయిన్ అర్చన మాట్లాడుతూ.. ‘మహిషాసుర మర్దిని కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇంత మంచి సబ్జెక్ట్‌ని, కర్మ స్థలం వంటి అద్భుతమైన టైటిల్‌తో సినిమాను తెరకెక్కించిన రాకీ గారికి థాంక్స్. కథను చెప్పేందుకు వచ్చినప్పుడు రాకీని చూసి కొత్త వాడు కదా.. ఎలా తీస్తారో అని అనుకున్నాను. కానీ కథను అద్భుతంగా నెరేట్ చేశారు. కథను చాలా మంది అద్భుతంగా చెబుతారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో తడబడుతుంటారు. కానీ నిర్మాత శ్రీనివాస్ గారి సహకారంతో దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ మూవీ పాన్ ఇండియ స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకం. నా హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రమిది. ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది. ఆ రోజు జరిగిన షూటింగ్ నాకు ఇంకా గుర్తుంది. ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయి. పోస్టర్ ఎంత ప్రభావం చూపిస్తోందో.. సినిమా కూడా అంతే ప్రభావం చూపించబోతోంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు రాకీ షెర్మన్ మాట్లాడుతూ.. ‘‘కర్మ స్థలం’ సినిమాకి మేం అంతా ప్రాణం పెట్టి, ఎంతో ఇష్టంతో పని చేశాం. వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. నిర్మాత శ్రీనివాస్ గారు నా వెన్నంటి ఉండి నడిపించారు. అర్చన గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆమె అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. ఎం.ఎల్ రాజా మంచి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత శ్రీనివాస్ సుబ్రహ్మణ్య మాట్లాడుతూ.. ‘‘కర్మ స్థలం’ సినిమాను ఎంతో కష్టపడి చేశాం. మా దర్శకుడు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో అందరినీ ఆకట్టుకునేలా చేశారు. అర్చన గారు అద్భుతంగా నటించారు. మా సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సంగీత దర్శకుడు ఎం.ఎల్. రాజా మాట్లాడుతూ.. ‘నా మీద నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. పాటలు చాలా బాగా వచ్చాయి. మున్ముందు అవి రిలీజ్ కాబోతున్నాయి. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
దిల్ రమేష్ మాట్లాడుతూ.. ‘తెలుగులో ఇంత వరకు కర్మస్థలం వంటి అద్భుతమైన టైటిల్ కనిపించలేదు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంద’ని అన్నారు.
బలగం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘కర్మస్థలం’ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. కథ ఎంత బాగా చెప్పారో.. అంతే అద్భుతంగా తీశారు. అర్చన గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…