సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం ” K-ర్యాంప్” సినిమా నుంచి ‘ది రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్ రిలీజ్, దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ” K-ర్యాంప్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ” K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. “K-ర్యాంప్” మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ రోజు ” K-ర్యాంప్” సినిమా నుంచి ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో మాస్ ఆటిట్యూడ్ ఉన్న కుమార్ అనే యువకుడిగా కిరణ్ అబ్బవరం కనిపించారు. చిల్ కావడంలో అతనికి పోటీ లేదు. ఈ క్యారెక్టర్ ను ఫుల్ ఎనర్జీతో పర్ ఫార్మ్ చేశారు కిరణ్ అబ్బవరం. ఈ గ్లింప్స్ చివరలో ‘మనం ఏఎంబీ సినిమాలో మలయాళ ప్రేమకథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉండే ఆంథెటిసిటీ మన సినిమాల్లో ఉండదు. ప్రేమ మాత్రం బాగుండాలని కోరుకుంటాం..’ అంటూ కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ గ్లింప్స్ కు హైలైట్ గా నిలుస్తోంది. ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్ చూస్తే ” K-ర్యాంప్” తో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అని తెలుస్తోంది.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు
టెక్నికల్ టీమ్
ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి
యాక్షన్ – పృథ్వీ
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – చేతన్ భరద్వాజ్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్), వంశీ శేఖర్
కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట
ప్రొడ్యూసర్ – రాజేష్ దండా-శివ బొమ్మకు
రచన, దర్శకత్వం – జైన్స్ నాని
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…