75 రూపీస్ కి ప్రీమియర్స్ తో నవంబర్ 8 న విడుదల కానున్న జితేందర్ రెడ్డి

రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ఇటీవలే జరిగింది.

హీరో రాకేష్ మాట్లాడుతూ, “ఎవరికీ చెప్పొద్దూ సినిమా తర్వాత, చేస్తే మంచి సినిమా చేయాలి కానీ మాములు కంటెంట్ తో సినిమా చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. లేట్ అయినా కానీ మంచి సినిమా చేయాలనే నేను డిసైడ్ అయ్యాను. మార్కెట్ కానీ బ్రాండ్ కానీ లేకపోతే ఏ హీరో ని పట్టించుకోరు. రాకేష్ అనే నేను ఒక బ్రాండ్ గా ఎదిగిన రోజున నేను కొత్త వాళ్ళతో సినిమా చేస్తాను. జితేందర్ రెడ్డి సినిమా నేను చేయడానికి కారణం ఈ సినిమా కథ. ఈ సినిమా పూర్తిగా చేసాం కానీ మే లో రిలీజ్ అనుకున్నాం. వేరే వేరే ఇష్యుస్ వల్ల సినిమా పోస్టుపోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడేం బాన్ చేస్తాం అంటున్నారు. కనీసం సినిమా చూసింది అందులో ఏం ఉందొ కూడా చూడకుండా అలా మాట్లాడుతున్నారు. జితేందర్ రెడ్డి గారు ఒక ఫైటర్. అయన అభిమానులు ఈ సినిమా చూస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. ఈ సినిమా కి 75 రూపీస్ తో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం” అని అయన అన్నారు.

దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ, “ఈ సినిమా ని డైరెక్ట్ చేయడం నేను లక్కీ గా ఫీల్ అవుతున్నాను. జితేందర్ రెడ్డి గారి కథ విన్నాక, నేను ఈ సినిమా చేయాలనే డిసైడ్ అయ్యాను. ఈ సినిమా కి చాలా పెద్ద స్పాన్ ఉంది. ఈ సినిమా కి సరైన నటీనటులు, టెక్నీషియన్స్ మరియు నిర్మాత అందరూ దొరికారు. ఈ సినిమా నిర్మాత వారి సోదరుడి కథ చెపుదాం అని ముందుకొచ్చారు. ఏ విధమైన కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా చేసారు. రాకేష్ నటించడమే కాకుండా నిర్మాణం లో కూడా హెల్ప్ చేసాడు. మీడియా వాళ్ళు కూడా మా సినిమా కి అందించిన సపోర్ట్ కి థాంక్స్. మంచి సినిమా తో మీ ముందుకు వస్తున్నాం అని ప్రగాఢంగా నమ్ముతున్నాం.” అన్నారు.

గేయ రచయిత రాంబాబు గోశాల మాట్లాడుతూ, “ఈ సినిమా లో అన్ని పాటలు రాసాను. ఇంతకు ముందు అర్జున్ రెడ్డి కి కంతారా కి రాసాను. వాటితో పోలిస్తే ఈ సినిమా పాటలు డిఫరెంట్ గా ఉంటాయి. నిన్న రిలీజ్ అయినా ఈ మట్టి బంగారం అనే సాంగ్ నా బెస్ట్ వర్క్ అనుకుంటాను. మజ్ను, ఉయ్యాలా జంపాల రాసాను, డైరెక్టర్ విరించి వర్మ గారు ఈ సినిమా లో అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు. హీరో రాకేష్ గారు బాగా కష్టపడ్డారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, “మీడియా వాళ్లందరికీ నమస్కారం. ఈ పాటికే ఈ సినిమా ఏంటి అని అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. నేనే తక్కువ సినిమాలు చూసే వాణ్ణి కానీ నేను ఈ సినిమా తీశాను. ఈ సినిమా ట్రావెల్ లో అందరితో పని చేయడం మర్చిపోలేని అనుభవం. ఈ సినిమా తీశానని తృప్తి నాకు ఉంది. నేను ఏదైతే చెప్పాలని అనుకున్నానో దాన్ని మీ అందరికీ చూపించే ప్రయత్నం చేశాను. జితేందర్ రెడ్డి జీవితం ఒక చరిత్ర. కానీ ఆ కథ ని చాలా బాగా చూపించారు. జగిత్యాల లో ప్రీమియర్ వేసాము. చూసిన వాళ్ళు చాలా మంది కళ్లనీళ్లు పెట్టుకున్నారు.” అన్నారు.

రాకేష్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

దర్శకుడు: విరించి వర్మ
నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి
సహ నిర్మాత: ఉమ రవీందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాణిశ్రీ పొడుగు
ఛాయాగ్రాహకులు: వీ ఎస్ జ్ఞాన శేఖర్
సంగీత దర్శకులు: గోపి సుందర్
ఎడిటర్: రామకృష్ణ అర్రం
పీఆర్: మధు వి ఆర్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago