నవంబర్ 22న విడుదలకు సిద్దమైన “ఝాన్సీ ఐపీఎస్”

ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, తెలుగులో మెగాస్టార్ లాంటి లెజండ్ సరసన నటించిన బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం నవంబర్ 22న విడుదలకు సిద్దమైంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన “ఝాన్సీ ఐపిఎస్” చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్ లక్మీ రాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. ఈ చిత్రానికి కూడా ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయి. మా ఆర్ కె బ్యానర్ కు మంచి పేరు తెచ్చే చిత్రం “ఝాన్సీ ఐపిఏస్. లక్మీ రాయ్ చేసిన మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటాయి. విద్యార్థులను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి, యువత భవిష్యత్ ను పెడదారి పట్టించే, డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపిఎస్ ఆఫీసర్ గా, గ్రామాల్లో రౌడీల అగడాలకు అడ్డుకట్టవేసే ఉగ్రనారిగా, కుర్రకారును ఉర్రూతలూగించే గ్లామర్ పాత్రల్లో లక్మీ రాయ్ తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించింది.

విజయశాంతి గారు నటించిన కర్తవ్యం, ఇలాంటి సినిమాలకు ఇన్స్పిరేషన్. కర్తవ్యం చిత్రంతో విజయశాంతి గారు లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు. కర్తవ్యం చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో, ఈ “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం కూడా ఘన విజయాన్ని సాధిస్తుంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 22న అత్యధిక థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

ప్రముఖ డాన్సర్, నటి ఆక్సఖాన్ మాట్లాడుతూ.. గతంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఎన్నో వచ్చాయి. కానీ లక్మీ రాయ్ నటించిన “ఝాన్సీ ఐపీఏస్” చిత్రానికి ప్రత్యేకత ఉంది. మూడు పాత్రల్లో అద్భుతంగా నటించారు లక్మీ రాయ్. ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు జె.వి.ఆర్ మాట్లాడుతూ..ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ కు “ఝాన్సీ ఐపిఎస్” చిత్రం మంచి పేరు, డబ్బు తీసుకువచ్చే చిత్రం అవుతుంది. మంచి పబ్లిసిటీ తో, అత్యధిక థియేటర్లలో నవంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

Tfja Team

Recent Posts

హేబల్‌వంత్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో థియేటర్లు ఊగిపోతున్నాయి: సక్సెస్‌మీట్‌లో చిత్ర యూనిట్‌

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

22 hours ago

‘హే బల్‌వంత్’తో కచ్చితంగా హిట్టు కొట్టబోతోన్నాం.. రిలీజ్ ప్రెస్ మీట్‌లో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత వంశీ నందిపాటి

‘లిటిల్‌హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా…

2 days ago

“ప్రభాస్ నిమ్మలతో కలిసి”మిరాకిల్” చేద్దాం రండి” అంటున్నహీరోయిన్ హెబ్బా పటేల్!!

సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న…

2 days ago

ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్‌ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’,…

3 days ago

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన హీరో సత్యదేవ్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నూతన చిత్రం

హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…

3 days ago